మోమిన్ పేట మండలం, యెన్కేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

మోమిన్ పేట మండలం, యెన్కెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి నిరహించవలసిన (32) రిజిస్టర్లను, నర్సరీ, వైకుంఠదామం నిర్మాణపు పనులను,దళితవాడలో మురికి కాలువలు, రోడ్లు విద్యుత్ సదుపాయాలను పరిశీలించారు.
ముందుగా జీపీ కార్యాలయంలో నిర్వహించాల్సిన (32) రకాల రిజిస్టర్లు పరిశీలించారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడంపై గ్రామ కార్యదర్శి కృష్ణ చైతన్యపై ఆగ్రహం వ్యక్తపరిచారు. గ్రామంలో జాబ్ కార్డులు కలిగిన ఉపాధి హామీ కూలీలా వివరాలు అడిగి తెలుసుకొని, అందరికి పని కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తపరిచారు. ఉపాధి హామీ కూలలకు తప్పనిసరిగా 100 రోజుల పనిదినాలు కల్పించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిదని, కార్యదర్శి తప్పకుండా గ్రామంలో ఉండాలని, ప్రతిరోజు ఉదయం 6:00 గంటలకు కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకొని పని ప్రాంతంలో వదలాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి 100 రోజుల పని దినాలు కల్పించాలని సూచించారు. ఈ సందర్బంగా డ్వాక్రా గ్రూప్ మహిళలతో సమావేశం నిర్వహించి వారికి కల్పిస్తున్న పని దినాలు, వారికి చెల్లించాల్సిన డబ్బులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసాకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేయాలని ఆశా కార్యకర్తను ఈ సందర్బంగా ఆదేశించారు.
గ్రామంలోని నర్సరీ నిర్వహణ, అసంపూర్తిగా ఉన్న వైకుంఠదామం నిర్మాణపు పనులను పరిశీలించారు. నర్సరీ నిర్వహణ సరిగా లేకపోవాడంతో కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వైకుంఠదామం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. చేసిన పనులకు సంబందించిన డబ్బులు సర్పంచిలకు సకాలంలో అందేవిధంగా ఎప్పటికప్పుడు FTO అప్లోడ్ చేయాలని ఆదేశించారు. చెప్పిన పనులన్నీ పూర్తి చేయాలని 15 రోజుల తర్వాత తిరిగి వస్తానని, నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు చేపట్టడం జరుగుతుందని గ్రామ కార్యదర్శిని హెచ్చరించారు.
అంతకుముందు అధికారులతో కలిసి దళిత వాడలో విస్తృతంగా తిరిగి విద్యుత్, రోడ్లు, మురికి కాలువలను పరిశీలించారు. గ్రామంలో సరిగా బస్సు సౌకర్యం లేదని, 35 మంది విద్యార్థులకు బోధించడానికి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని, వర్షాల వల్ల రోడ్లు అన్ని దెబ్బతిన్నాయని గ్రామస్థులు తెలుపగా కలెక్టర్ స్పందిస్తూ పాఠశాలకు ఒక ఉపాధ్యాడిని నియమిస్తానని రోడ్ల మారమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కృష్ణన్, ఎంపీడీఓ శైలజారెడ్డి, ఎంపీవో యాదగిరి, సర్పంచ్ అనంతమ్మ, గ్రామ కార్యదర్శి కృష్ణ చైతన్య, టి ఏ ఎల్లయ్య, ఆర్. ఐ. అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post