మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయం. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చిన మహోన్నత వ్యక్తి. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమమని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ నందు ఆయన జయంతి సందర్బంగా టి.యస్ మేసా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధ్యక్షులు షేక్ జమీరుద్దీన్ తో కలసి ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 11 న ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం ను జరుపు కోవడం జరుగుతుందని అన్నారు. జర్నలిజం లో అపార అనుభవం తో పాటు ఉర్దూ పత్రికలను నెలకొల్పి న్నారని అలాగే మొదట కేంద్ర విద్యా శాఖా మంత్రిగా పనిచేసిన ఆయన విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చారని పేర్కొన్నారు. ఆయన మరణానంతరం ఆయన సేవలకు గుర్తుగింపుగా కేంద్ర ప్రభుత్వం 1992 లో భారత రత్న బిరుదు ఇచ్చి గౌరవించిందని ఈ  సందర్బంగా అదనపు కలెక్టర్ అన్నారు.
    ఈ కార్యక్రమంలో tngos జిల్లా అధ్యక్షులు జనిమియా, కలెక్టరేట్ ఉద్యోగులు యండి. హాబీబ్, బడేసాహెబ్, రహీద్, రఫియా బేగం, అస్మ, అసియాబేగం, జానీ, గౌస్, సగదుల్లా తదితరులు పాల్గొన్నారు.

Share This Post