మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం…

ప్రచురణార్థం

మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం…

మహబూబాబాద్ నవంబర్ 10.
కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

బుధవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని కళాశాలల వసతుల కల్పన లపై ప్రిన్సిపాల్స్ తో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పనకు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపాల్ కు హామీ ఇచ్చారు. కళాశాలల వసతుల కల్పనపై నివేదిక ఇవ్వాలని సూచించారు

విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా ప్రిన్సిపాల్స్ చర్యలు తీసుకోవాలన్నారు.
కళాశాలలకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇస్తామన్నారు.

ఈ సమావేశంలో మహబూబాబాద్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి , తొర్రూరు ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్, గార్ల లక్ష్మణరావు, మరిపెడ ప్రేమలత, ఐక్యూ ఏ ఎస్ వేణుగోపాల్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు
—————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post