యం.జి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ బాలుర జూనియర్ కళాశాల భవనాన్ని ఆధునిక హంగులతో నిర్మించేందుకు ప్రణాళికలు – స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి

యం.జి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ బాలుర జూనియర్ కళాశాల భవనాన్ని ఆధునిక హంగులతో నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్బంగా కళాశాల భవన స్థితిగతులు పరిశీలించి నూతన భవనం నిర్మించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ప్రణాళికలపై కలెక్టర్ తో సమీక్షించారు. ప్రభుత్వ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, తిమ్మాజీపేట లో నిర్మిస్తున్న పాఠశాల మాదిరి మరో మండలంలో పాఠశాల నిర్మించాలని అనుకోవడం జరిగినప్పటికిని పట్టణంలోని కళాశాల శిథిలావస్థకు చేరుకున్నందున దీనిని అన్ని హంగులతో నిర్మాణం చేపట్టాలనుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కళాశాల భవనం, పాఠశాల భవనం ఎంత విస్తీర్ణంలో ఉంది ఇందులో కళాశాల విస్తీర్ణం, పాఠశాల విస్తీర్ణం గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ సర్వేయర్ ను ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న చెట్లు చాలా గొప్పవని వాటికి నష్టం కలిగించకుండా నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సర్వేయర్ ను సూచించారు.
డి.సి.సి.బి డైరెక్టర్ జక్క రఘునందన్, జడ్పిటిసి శ్రీశైలం, ఎంపిపి నర్సింహ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post