యం.జి.యం. ఆసుపత్రిలో వయోవృద్దుల సౌకర్యార్థం ప్రత్యేక ఓ.పి. సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు , జిల్లా కలెక్టర్ బి.గోపి. గారు

తేదీ: 20.09.2021 రోజున యం.జి.యం.ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రత్యేక ఓ.పి. సెంటర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగ్ రావు మాట్లాడుతూ ” సీనియర్ సిటిజన్స్ ని సమసమాజానికి మార్గ నిర్దేశకులు అభివర్ణించారు. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆగస్టు 21వ తేదీన *సీనియర్ సిటిజన్స్ డే* సందర్భంగా ఏర్పాటు చేసిన *న్యాయ విజ్ఞాన సదస్సు* లో వయో వృద్ధులు తమ సమస్యలను న్యాయసేవాధికార సంస్థకు తెలపడం జరిగింది. వారు వృద్ధాప్య సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తెలియ పరచడం జరిగింది.వాటిలో ముఖ్యంగా వైద్య, ఆరోగ్య సమస్యలతో గురవుతున్నారని ఆస్పత్రులలో లైన్లో నిలబడడానికి ఇబ్బందిగా ఉందని,తమ ఆరోగ్యం సహకరించడం లేదని వృద్ధులకు ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం కోసం గతంలో ఎం.జీ.ఎం సూపరిండెంట్ గారికి తెలియపరిచిననూ సమస్య పరిష్కారం జరగలేదని న్యాయసేవాధికార సంస్థ ను ఆశ్రయించడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా మేము న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఎం.జి.యం. సూపరిండెంట్ గారికి వినతి పత్రం అందజేసినప్పుడు సూపరింటెండెంట్ గారు సానుకూలంగా స్పందించి, ఈ ప్రత్యేక వార్డు ను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని తెలిపారు, ఈ కార్యక్రమానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కమిటీ మెంబర్ అయినటువంటి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి గారు విచ్చేయడం గర్వకారణమని కూడా తెలిపారు. ఈ ప్రత్యేక వార్డు వల్ల వృద్ధులు ఎవరు సామాన్య ప్రజలతో కాకుండా, ప్రత్యేక వార్డులో వైద్య చికిత్సలు నిర్వహించుకొని, అన్ని రకములైన వైద్య సదుపాయాలు పొందవచ్చునని తెలిపారు. ఇంతే కాకుండా వృద్ధులు వారి హక్కులను పొందుటకు న్యాయసేవాధికార సంస్థ ను సంప్రదించి, న్యాయపరంగా వారి హక్కులను పొందవచ్చునని తెలిపారు. చట్టపరమైన వయోవృద్ఫుల సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తామని అన్నారు.ఎటువంటి సమస్యలను అయినా న్యాయసేవాధికార సంస్థలు వృద్ధులు, మహిళలు, పిల్లల సమస్యలకు జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ ” ఈ ప్రత్యేక వృద్ధుల ఓ.పి. వార్డు ద్వారా వృద్ధులు ఇబ్బందులు పడకుండా, సమయం వృధా కాకుండా త్వరగా చికిత్స నిర్వహించుకొని డాక్టర్ ను సంప్రదించే అవకాశం ఉన్నందున, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకోవలసినదిగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.వి. మహేష్ నాథ్, ఎం.జీ.ఎం. సూపరింటెండెంట్ డాక్టర్ వి. చంద్రశేఖర్ “సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్” విద్యారణ్యపురి, గోపాలపురం సంస్థ అధ్యక్షులు శ్రీ దామెర నర్సయ్యగారు పాల్గొనడం జరిగింది. ఈ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం ద్వారా వృద్ధులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎంజీఎం సూపరిండెంట్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share This Post