యం.జి.యూనివర్సిటీ లో పి.జి.కళాశాల హాస్టల్, ఇంజినీరింగ్ కళాశాల ల భవన నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

యం.జి.యూనివర్సిటీ లో పి.జి.కళాశాల హాస్టల్, ఇంజినీరింగ్ కళాశాల ల భవన నిర్మాణ పనులు    పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*         *మార్చి లోగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలి*             నల్గొండ, జనవరి 4.    యం.జి.యూనివర్సిటీ లో పి.జి.విద్యార్థులకు కొరకు నిర్మాణం పూర్తి చేసిన హాస్టల్ భవనాలు ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణం,ఇతర పనులు మార్చి లోగా పూర్తి చేసి  ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికరులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి లు ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి లు యం.జి.యూనివర్సిటీ సందర్శించి యూనివర్సిటీ లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులు పరిశీలించారు.తెలంగాణ విద్య,సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ ఈ ఈ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో పి.జి.విద్యార్థులకు హాస్టల్ నిర్మాణం, విద్యార్థిని లకు హాస్టల్ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు,స్టాఫ్ క్వార్టర్ పనులు పూర్తి అయినట్లు,ఆంపి థియేటర్ పనులు కూడా తుది దశలో ఉన్నవని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు కూడా ప్రగతి లో నున్నట్లు మార్చి వరకు పూర్తి చేస్తామని తెలంగాణ విద్య,సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ  ఈ ఈ అనిత వివరించారు. పి.జి.విద్యార్థుల హాస్టల్ కు మంచి నీటి వసతి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.                            తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల  అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ శాఖ(టి.ఎస్.ఎం.ఐ. డి.సి )ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం పనులు జిల్లా కలెక్టర్,శాసన సభ్యులు పరిశీలించారు.గ్రౌండ్ ప్లోర్ పూర్తి చేసినట్లు,మొదట ఫ్లోర్ పనులు నిర్మాణం జరుగుతున్నట్లు  టి.యస్.యం.ఐ. డి.సి.ఈ ఈ అజీజ్ వివరించారు. జూన్ వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వి.సి.క్వార్టర్ పనులు కూడా పూర్తి కావచ్చినట్లు తెలిపారు.ఎగ్జామ్ హాల్ పనులు కూడా తుది దశలో ఉన్నట్లు వివరించారు.ఇంజినీరింగ్ కళాశాల ప్రవేశ ద్వారం వద్ద డిజైనింగ్ కు శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సూచనలు చేశారు.యం.జి.యూనివర్సిటీ లో మిగిలిన అన్ని పనులు కూడా మూడు నెలల్లో పూర్తి చేసి ప్రారంభించడానికి తగిన విధంగా సిద్ధం చేయాలని కలెక్టర్ ,శాసన సభ్యులు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ తో పాటు యూనివర్సిటీ వి.సి.సి.హెచ్ గోపాల్  రెడ్డి,మున్సిపల్ చైర్మన్ యం.సైది రెడ్డి, యూనివర్సిటీ డెవలప్ మెంట్ ఆఫీసర్ వెంకట రమణ,యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్ మెంట్ ప్రొఫెసర్ అలువాల రవి, యూనివర్సిటీ ఇంజినీరింగ్,నిర్వహణ ఏ. ఈ. శైలజ తదితరులు ఉన్నారు.

Share This Post