యాదాద్రి జిల్లా ఖజానా కార్యాలయంలో గానీ, జిల్లా పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయాలలో గానీ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదని జిల్లా ఖజానా అధికారి ఆర్. సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ల్లుల మంజూరు విషయంలో సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్ నుండి బిల్లులు, చెక్కులు ట్రెజరీ కార్యాలయమునకు అందిన వెంటనే ట్రెజరీ నిబంధనల ప్రకారం టోకెన్ నెంబర్ జారీ చేయడం జరుగుతుందని,  తరువాత సెక్షన్ అకౌంటెంట్ నుండి సంబంధిత ఎస్.టీ.ఓ. కు, తదుపరి ఎ.టీ.ఓ.  లేదా అసిస్టెంట్ డైరెక్టర్ వరకు వెళ్లి బిల్లు పాస్ అయిన తదుపరి ఇ-కుబేర్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు.  తదుపరి కార్యాలయ పరిధి దాటి ఫైనాన్స్ కు,  ఆ తదుపరి ఆర్బీఐ వద్దకు IFMIS సైట్ ద్వారా చేరుతుందని తెలిపారు.  ఆర్బీఐ అనుమతితో నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో సంబంధిత వ్యక్తుల అకౌంట్లలో డబ్బులు జమ కావడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి ప్రక్రియలో ట్రెజరీ పరిధిలో ఏ స్థాయిలో కూడా బిల్లు మంజూరులో జాప్యం జరగదని,  ట్రెజరీ నిబంధనల ప్రకారం ఒక బిల్లు సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్ నుండి ట్రెజరీ అకౌంటెంట్ కు చేరినప్పటి నుండి 5 పని దినాలలో అట్టి బిల్లును పాస్ చేయడం కానీ,  లేదా సంబంధిత ఉత్తర్వుల కాపీలు కానీ,  ఇతర డాక్యుమెంట్స్ కానీ ట్రెజరీ నిబంధనల ప్రకారం జత చేయనట్లయితే అట్టి బిల్లులు సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్ కు తిరిగి పంపబడతాయని తెలిపారు. ఇట్టి ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా IFMIS ఎస్ సైట్ ద్వారా జరుగుతుందని తెలిపారు.
కావున ఖజానా కార్యాలయంలో అవినీతికి ఆస్కారం లేదంటూ,  అయినప్పటికీ ఎవరైనా ఉద్యోగి బిల్లులు, చెక్కులు మంజూరు విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లయితే అట్టి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.

Share This Post