యాదాద్రి-భువనగిరి జిల్లా నూతన ట్రెసా* కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిగా పి.శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వలిగొండ ఆంజనేయులు మరియు కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

యాదాద్రి-భువనగిరి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA) జిల్లా/డివిజన్/కలెక్టరేట్ నూతన కార్యవర్గ సభ్యులు  గౌరవ కలెక్టర్ మేడం గారిని పూల మొక్కలు అందించి సన్మానించనైనది.
మరియు జిల్లాలో మన రెవిన్యూ శాఖలో గల సమస్యల అయిన తహశీల్దార్ కార్యాలయంలో కరెంట్ బిల్స్ మంజూరు, ధరణి రిజిస్ట్రేషన్ ల కొరకు స్టేషనరీ చార్జీలు మంజూరు గురించి కోరడం జరిగింది.
తదుపరి ధరణి లో వచ్చే ధరఖాస్తులపై చర్చించినారు, అట్టి ధరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కొరినారు.
ఇట్టి సమావేశంలో లో రెవిన్యూ ఉద్యోగుల తో సుదీర్ఘంగా చర్చించారు.
కొత్త TRESA కార్యవర్గానికి  శుభాకాంక్షలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా/డివిజన్/కలెక్టరేట్ కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు.  జిల్లా అధ్యక్షులు పి.శ్యామ్ సుందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఆంజనేయులు కార్యవర్గ సభ్యులు శ్రీనివాస రాజు, వీరా బాయి, వెంకట్ రెడ్డి,సుధాకర్ రావు,  గణేష్,పి.జ్యోతి, జయమ్మ, దశరథ,  పి.వి.హరికిషన్, మల్లికార్జున్, యాదగిరి, రాం ప్రసాద్, శర్మ, రామారావు, ఇతరులు పాల్గొన్నారు.
ఇట్లు
*యాదాద్రి-భువనగిరి ట్రెసా కమిటీ*

Share This Post