యాదాద్రి భువనగిరి జిల్లా మరియు నల్లగొండ జిల్లా, చిట్యాల కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం సోమవారం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నల్లగొండ జోన్ జోన్ అధికారిని v. జ్యోతిర్మయి గారి పర్యవేక్షణలో నిర్వహించిన ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా కు మంచి స్పందన వచ్చింది వ్యాపారులు ఈరోజు నిర్వహించినటువంటి లైసెన్స్ మేళాలో పాల్గొని వారి వ్యాపార అనుమతి పత్రాలైనటువంటి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం పాల్గొని నమోదు చేసుకోవడం జరిగింది ఈరోజు జరిగినటువంటి లైసెన్స్ మేళాలో నల్లగొండ
జిల్లాల్లోని చిట్యాల మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కూరగాయల వ్యాపారులు మరియు ఆహార వ్యాపారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క వ్యాపారానికి సంబంధించిన అనుమతి పత్రాలను అనగా లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ ఈరోజు అప్లై చేసుకోవడం జరిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారులకు ఎగుమతి దిగుమతులకు ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం ఉండాలని అందులో భాగంగానేమేళా నిర్వహించినట్లు చెప్పారు. లైసెన్స్ పొందడం ద్వారా ఆహార వ్యాపారానికి చట్టపరమైన ప్రయోజనాలను అందించవచ్చనీ చెప్పారు. లైసెన్స్ పొందిన వ్యాపారులందరూ కూడా ఫుడ్ సేఫ్టీ చట్ట పరిధిలోకి వస్తారని లైసెన్స్ పొందిన వారు వారి వ్యాపారాలకు సంబంధించి అన్ని లైసెన్సింగ్ రూల్స్ పాటిస్తూ ఆహార పరిరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా వ్యాపారాలు జరపాలని సూచించారు. ఎవరైతే ఇప్పటికీ ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందని వారు తప్పనిసరిగా తక్షణమే తీసుకోవాలని, లేకుంటే ఆరు నెలల జైలు శిక్షతోపాటు ఐదు లక్షల జరిమానా విధించబడుతుందనీ వ్యాపారులకు హెచ్చరించారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిసిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్ గారు మరియు లతీఫ్,స్వరాజ్యం,శివ,వినోద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.