యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

Press note. 19.10.2021

28.3.2022 తేదీన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు.

మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియా వారితో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

28.3.2021 తేదీన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాకుంభ సంరక్షణ ప్రారంభం అవుతుందని, దానికి ముందు ఎనిమిది రోజుల ముందు 21వ తేదీన మహా సుదర్శన యాగంతో ప్రారంభమవుతుందని తెలిపారు.
స్వయంభువుగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈ విషయాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమైక్య పాలనలో అన్ని రంగాలలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, ఆధ్యాత్మిక విషయంలో నిరాదరణకు గురి అయిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం గోదావరి, కృష్ణ, ప్రాణహిత నదులలో పుష్కర ఘాట్ లను ఏర్పాటు చేసుకుని, మంత్రులు వాలంటీర్లుగా పనిచేసి పుష్కర శోభను ప్రపంచానికి పరిచయం చేశాలని తెలిపారు.
గొప్ప సాంస్కృతిక చరిత్ర కలిగిన తెలంగాణ మనది. ఆధ్యాత్మిక రంగంలో గొప్పది. దాని పరిమళాలు నూతన చరిత్రకారులు వెలికి తీస్తున్నారని అన్నారు.
మహా ఉత్క్రుష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని నేను 50 ఏళ్ల కింద మెట్ల మార్గం ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకున్నానని అన్నారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణ అని,
అష్టాదశ పీఠాలలో భాగంగా మన తెలంగాణలో జోగులాంబ దేవాలయం శక్తిపీఠమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పుష్కర రూపంలో సుసంపన్నం చేశామని అన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ కిషన్ రావు తెలంగాణ బిడ్డ అని , మన శిల్పారామం సృష్టికర్త అని‌, అలాంటి వారి ఆధ్వర్యంలో ఈ పుణ్యక్షేత్రం చక్కగా ఆవిష్కృతం అవుతున్నదని, తిరుమల మాదిరిగానే మన రాష్ట్ర ప్రజలు యాదాద్రి ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారని, ప్రారంభం మన చేతుల్లో ఉండదని, చాలా పద్ధతులలో చేయాల్సి ఉంటుందని, ఈ ఆలయ వైభవం నలుమూలలా చాటే కార్యక్రమంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి వైష్ణవ సాంప్రదాయం సూచనల మేరకు పరిశీలించడం జరిగిందని తెలిపారు. కాలేశ్వరంలో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ నృసింహస్వామి రిజర్వాయర్ గా పిలవడం జరుగుతుందని, ప్రతిరోజు గోదావరి జలాలతో లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాలను దర్శించుకోవడం మన అదృష్టం అని, అలాగే ఆలేరు, భువనగిరి, రామన్నపేట, నకిరేకల్ సంబంధించి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని‌, ఇది స్వామి వారి దీవెన అని, 1000 ఎకరాలలో టెంపుల్ సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి , ముఖ్యమంత్రులు, గవర్నర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా వసతి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే 1000 సూట్లతో 250 కాటేజీల నిర్మాణం చేపడుతున్నట్లు, త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం జియ్యర్ గారి సూచనలతో విద్వత్తు, సిద్ధాంతుల సభలో ముహూర్తం నిర్ణయించడం జరిగిందని, మహా సుదర్శన హోమం తోనే ప్రారంభం అవుతుందని తెలిపారు. సహస్రాశ్ట 1008 కుండలతో నిర్వహించడం జరుగుతుందని, 6 వేల మంది ఋత్విక్కులు పాల్గొంటారని, వివిధ పుణ్యక్షేత్రాల పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరూ దీవించాలని అన్నారు. హోమ్ కార్యానికి ఒక లక్షా యాభై వేల కిలోల కల్తీ లేని నెయ్యి వినియోగిస్తున్నట్లు తెలిపారు. అనేక లక్షల మంది భక్తులు వస్తారు, అనేక పనులు చేస్తే తప్ప నెరవేరదని, రేపటి నుండి మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. స్వామి వారి గర్భగుడి విమాన గోపురం స్వర్ణ తాపడంతో చేయించాలని నిర్ణయించామని, 125 కిలోల బంగారం అవసరమవుతుందని, ఈ కార్యం కోసం అందరూ సంతోషంగా ముందుకు వస్తున్నారని, 65 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. దీని కోసం గౌరవ ప్రజాప్రతినిధుల సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 12769 గ్రామపంచాయతీలు, 3600 వార్డులు, 142 మున్సిపాలిటీల ద్వారా అందరిని భాగస్వామ్యం చేయడం జరుగుతుందని, కమిటీ పర్యవేక్షణలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా బంగారంతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొట్ట మొదట స్వామివారికి విమాన గోపురానికి మా కుటుంబం నుండి ఒక కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని నాలుగు వేల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, ప్రతి తండా నుండి పదకొండు రూపాయల చొప్పున ఇచ్చినా సంతోషమేనని అన్నారు. ఈ ఆలయం మనది అనే భావనతో అందరు స్వామివారి కార్యానికి ముందుకు రావాలని అన్నారు. జర్నలిస్టులు వార్తావాహకులని, భక్తి పరంపరలో వారు స్వామివారి పుణ్యక్షేత్రం మహిమలు‌, విశేషాలను ప్రమోట్ చేయాలని కోరారు. ఈరోజు సంతోషంగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, 60 లక్షల ఎకరాలలో పంట రాబోతోందని అన్నారు. అలాగే ఒంటరి మహిళలకు పెన్షన్ లు, కులం జాతి అనేది లేకుండా అందరికీ సంక్షేమానికి ఏర్పాటు చేశామని, తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. జాతీయ అంతర్జాతీయంగా ఆకర్షించే విధంగా 250 కాటేజీల నిర్మాణం వెంటనే చేపడతాం అని తెలిపారు. కళ్యాణకట్ట , పుష్కరిణి పనులు వేగంగా పూర్తి చేస్తామని, అలాగే ఉచిత బస్సు కోసం బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, హైదరాబాద్ జలమండలి వారి సహాయంతో అండర్ డ్రైనేజీ, వర్షాకాలంలో నీరు వెళ్ళేలా రెండు రకాలుగా డ్రైనేజీ వ్యవస్థ వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందని, దీనికోసం జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులకు కూడా జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి ఇండ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకుంటారని, చక్కని కాలనీ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. జర్నలిస్టులు దేవాలయ మార్పు చూసినవారు కాబట్టి వార్తా వాహకాలుగా ఆలయ వార్తలు, రాష్ట్ర విశిష్టతను చక్కటి పరిశోధన వ్యాసాలుగా అందించాలని సూచించారు. దళిత బిడ్డలకు నవంబర్ 4వ తేదీ తర్వాత దళిత బంధు పథకం ద్వారా వారి ఆర్ధిక ఉన్నతికి పది లక్షల రూపాయల సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. యాదాద్రి పై యాదర్షి ఋషి పేరుతో మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. అలాగే బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప సౌందర్య కన్వెన్షన్ సెంటర్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Share This Post