యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి…

ప్రచురణార్థం

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి…

మహబూబాబాద్ డిసెంబర్ 4.

యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ అధికారులతో ప్రత్యామ్నాయ పంటలపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాధించే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఊరూర రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన పరచాలి అన్నారు.

వచ్చే సంవత్సరం వేసంగి నుండి ప్రభుత్వం ఎఫ్ సి ఐ ద్వారా పార బాయిల్డ్ రైస్ తీసుకోమని తేల్చి చెప్పినట్లు కలెక్టర్ తెలిపారు అదేవిధంగా తెలంగాణలో యాసంగి పంట మాత్రమే తీసుకునే అవకాశం ఉందని రైతులు వరి పంట కు బదులుగా ఇతర పంటలపై దృష్టి పెట్టాలన్నారు. విత్తనాల వరకు మాత్రమే వరి వేసుకోవచ్చు నన్నారు. జిల్లాలోని 82 రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటలపై విస్తృత ప్రచారం జరపాలన్నారు ప్రతిరోజు ఒక గ్రామ పంచాయతీ లోని వారికి అవగాహన పరచాలని ప్రజా ప్రతినిధులను కూడా సమావేశాలకి ఆహ్వానించాలని అన్నారు దూర ప్రాంతాలలో రైతులకు ఆయా ప్రాంతాలలోనే సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు భూసారాన్ని బట్టి రైతులు పంటలు వేసుకుంటే అధిక లాభాలను గడించవచ్చు అన్నారు. ప్రత్యామ్నాయ పంటలలో ప్రొద్దుతిరుగుడు వేరుశెనగ నువ్వులు మినుములు జనుము వంటి పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నందున రైతులు ఆయా పంటలను చేపట్టాలని కోరారు.

ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి పెట్టాలని రూపొందించిన పోస్టర్లను పుస్తకాలను కరదీపిక లను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ అధికారి చత్రు నాయక్, ఏడిఏ లు లక్ష్మీనారాయణ శోభన్ బాబు రాజా నరేందర్ మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు
——————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post