యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి:: జిల్లా కలెక్టర్ డి హరిచందన

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

సోమవారం నారాయణపేట మండలం సింగారం గ్రామం లో రైతు వేదిక లో రైతుల తో  నిర్వహించిన సమావేశం లో యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్‌ డి హరిచందన  రైతులకు సూచించారు. నారాయణపేట మండలంలోని సింగారం, ధన్వాడ మండల కేంద్రం  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంట లపై సోమవారం ఉదయం నిర్వహించిన అవగాహన కార్యక్ర మంలో మాట్లాడారు. వరి పంటను కేంద్రం కొను గోలు చేసే అవకాశం లేనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇకపై ఉండవన్నారు. వరి సాగుకు బదులుగా పప్పు దినుసు పంటలైన పెసర, మిను ము, వేరుశనగ, నువ్వులు, జొన్నలు, సజ్జలు, కొర్ర లు, కూరగాయలు  సాగు చేయాలని సూచించారు. యసంగి లో సాగు చేసే వరి నూకలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యేనమేయ లో తోటలను సాగు చేయాలని పండ్ల తోటలు కూరగాయల తోటలు మరియు పులా తోట లను సాగు చేయాలని సూచించారు. తోటల మేంపకం వలన అధిక లాభాలు వస్తాయని తెలిపారు. తోటల పెంపకం లో ప్రభుత్వం ద్వారా సబ్సిడీ లభిస్తుందనన్నారు. రైతులు అందరూ ఒకే రకం పంట పండించడం వలెక్న నష్ట ని గురి అవుతారని సూచించారు. యసంగి లో నష్టాన్ని గురికాకుండా ఉండాలనే ఉద్యేష్యం తోనే ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని సూచించారు. అడవి పందుల నుండి కాపాడుకోవడానికి మార్కెట్ లో పరికరాలు లభిస్తాయని వాటిని ఉపయోగించి రక్షకించు కోవచన్నారు. యసంగి లో వరి కి బదులు ప్రత్యన్మేయా పండిస్తే వాటి కి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని సూచించారు. అధికారులు భూ పరీక్ష లు నిర్వహించి పంట లలో ఏమిసాగు చేయాలనే విషయాన్ని అధికారులు తెలియజేస్తారన్నారు. జిల్లా లోని రైతులు ముందుకు వచ్చి ఇతర  పంటల సాగు పై మొగ్గు చూపాలని కోరారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఉద్యానవన అధికారి వెంకటేశ్వర్లు, AEO లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post