యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులు చొరవ చూపాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులు చూపాలని జిల్లా కలెక్టర్‌ భారతి
హోళ్ళికేరి తెలిపారు. గురువారం జిల్లాలోని హాజీపూర్‌ మండలం రాపల్లి గ్రామం, దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామాలలో రైతులకు పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ యాసంగి పంటకు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని, వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుదని తెలిపారు. తప్పనిసరిగా వరి సాగు జే రైతులు సంబంధిత రైస్‌మిల్లర్లు, విత్తన సంస్థలతో ముందుగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. రైతులు ఏ మాత్రం నష్టపోకుండా వరి సాగు మినహాయించి వాణిజ్య, ఆరుతడి పంటలైన మినుములు, పెసర, కంది, మొక్కజొన్న నువ్వులు, వేరుశెనగ, ఆయిల్‌ ఫామ్‌, పొద్దు తిరుగుడు, కూరగాయలు తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, సర్పంచ్‌లు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post