యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా రైతులను చైతన్యం చేయాలి :జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా రైతులను చైతన్యం చేయాలి
– వానాకాలం ధాన్యం సేకరణలో ప్రతిబంధకాలు లేకుండా వేగంగా జరిగేలా చూడాలి

– ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

– వచ్చే వారం నుంచి ఆర్జీల ఆక్షన్ టేకెన్ రిపోర్ట్ పై సమీక్షిస్తాం

– జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్


కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున, జిల్లాలో వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా జిల్లా రైతులకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ వ్యవసాయ , ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు.

సోమవారం IDOC మీటింగ్ హల్ జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజల వినతులు, ఫిర్యాదులను అదనపు కలెక్టర్ స్వీకరించారు.
అనంతరం వానాకాలం ధాన్యం పంట కొనుగోళ్ళ పురోగతి,యాసంగి పంటల సాగు, కో వి డ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (FCI) ఇకముందు బాయిల్డ్ రైస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయమని స్పష్టం చేసిందన్నారు. రైతులకు ఇట్టి విషయమై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపో రాదని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు గ్రామ స్థాయి నుండి, రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి రైతులకు యాసంగి లో వరి సాగు చేయవద్దని, వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవలసిందిగా అవగాహన కల్పించాలని సూచించారు.

వానాకాలం ధాన్యం పంట కొనుగోళ్ళు సాఫీగా,వేగంగా జరిగేలా చూడాలి

జిల్లాలో వానాకాలం ధాన్యం సేకరణలో ప్రతిబంధకాలు లేకుండా సాఫీగా , వేగంగా జరిగేలా చూడాలని మండల ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం కు సంబంధించి ఏరోజుకు ఆరోజే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ లో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యుల పై చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

ప్రోక్యూర్ మెంట్ పై రెవెన్యూ డివిజన్ అధికారులు , నియోజకవర్గ బాధ్యులు, క్లస్టర్ ఇంచార్జీ లైన మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్ లు,MPDO లు, MAO లు వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉంటూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం ను వెంటనే తూకం వేసేలా వేయడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లు లకు పంపాలని సూచించారు. ధాన్యం కొన్న రైతులకు సకాలంలో పే మెంట్ లు జరిగేలా చూడడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత RDO , మండల ప్రత్యేక అధికారి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.

నియోజవర్గ బాధ్యులైన DRO, ఆర్డీఓ లు, DRDO లు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వారీగా క్లస్టర్ ఇంచార్జీ అధికారులు, కేంద్రం నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలు చేసి పే మెంట్ చేరే వరకు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి పురోగతి బాగుండేలా చూసుకోవాలన్నారు .

కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్న ధాన్యం, ఇప్పటికే కేంద్రంలో తూకం వేసిన ఉన్న ధాన్యం వివరాలను తెలుసుకుని అవసరమైన గన్ని బ్యాగ్ ల ను సమకూర్చు కొవాల న్నారు.
హమాలీలు, గోనె సంచుల కొరత ఉంటే సమకూర్చుకోవాలని సూచించారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలు స్థానికంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం ను వర్షం కు తడవకుండా ఉండేందుకు వీలుగా వెంటనే తరలించాల నీ అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు.

రెండో డోస్ వాక్సినేషన్ సాధ్యమైనంత త్వరగా శతశాతం పూర్తి కావాలి

కరోనా న్యూ వేరియంట్ పలు దేశాల్లో ప్రబలుతున్నదని, జిల్లాలో అన్ని విధాల జాగ్రత్తలు చేపడుతున్నామని అన్నారు . జిల్లాలో కోవిడ్ జాగ్రత్తలు విధిగా పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వంద శాతం రెండో డోస్ వ్యాక్సినేషన్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు .

వచ్చే వారం నుంచి ఆర్జీల ఆక్షన్ టేకెన్ రిపోర్ట్ పై సమీక్షిస్తాం

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు ,వినతులను సంబంధిత ప్రభుత్వ శాఖలు తక్షణం పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. వచ్చే వారం నుంచి ఆర్జీల ఆక్షన్ టేకెన్ రిపోర్ట్ పై శాఖల వారిగా సమీక్షిస్తామని తెలిపారు . ఈ ప్రజావాణి లో వచ్చిన ఆర్జీలను శాఖల వారిగా పంపిస్తున్నామని వచ్చే ప్రజావాణి కల్లా అన్ని ప్రజావాణి ఆర్జీలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post