యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలి మొదటి డోసు పూర్తైన వారు రెండవ డోసుకు సిద్దంగా ఉండాలి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్థం-1
జనగామ,డిసెంబర్.07 :యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని, మొదటి డోసు పూర్తైన వారు రెండవ డోసుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని లింఘాల ఘనపురం, దేవరుప్పుల మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె ప్రకృతి వనం తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేనందున ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఉండదని కావున రైతులు ప్రత్యామ్నాయ పంటల అయిన వేరుశెనగ, శెనగ, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదము, పెసరు, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న తదితర పంటల వైపు మొగ్గుచూపాలని అన్నారు. ఒక వేల రైతు ఇంటి అవసరాల నిమిత్తం లేదా సీడ్స్ కంపెనికి గాని, రైస్ మిల్లులకు గాని నేరుగా అమ్మాలనుకునే వారు మాత్రమే వరి పంట వేసుకోవచ్చ అని మార్కెట్ ను బట్టి ధర వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రైతు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రైతులు ఏదైనా అనుమానాలు, సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏ పంట వేయాలి , ఎలా వేయాలి, ఎన్ని నెలలు పడుతుంది, ఎంత లాభం వస్తుంది, తదితర సందేహాల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 72888 94712 కు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ ద్వారా రైతులు వారి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. ప్రతి గ్రామoలో వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారితో పాటు అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు పంచాయతీ కార్యదర్శులు, జిపి ప్రత్యేక అధికారి బృందం సిద్ధంగా ప్రతి రోజు వాక్సిన్ తో అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రత్యేక క్యాంపు లు నిర్వహించి మొదటి డోసు వంద శాతం పూర్తిచేసుకున్నందున రెండవ డోసుకు ఒకటి రెండు రోజుల్లో (84) రోజులు పూర్తి అవుతున్నదని, రెండవ డోసుకు అర్హత కలిగిన అందరు స్వచ్చందంగా వచ్చి వాక్సిన్ వేసుకోవాలన్నారు. వాక్సిన్ తీసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదానికి కారణం అవుతుందని అన్నారు. జన సమూహం అధికంగా ఉన్న చోట తప్పనిసరిగా బౌతిక దూరం పాటిస్తూ సానిటైజేషన్ చేసుకొని, మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కరోనా పై ఎలాంటి వదంతులు నమ్మవద్దని, ప్రజలు స్వయం నియంత్రణతో కరోనాను ఎదురించాలన్నారు. లింఘాల ఘనపురం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గుమ్మడవల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని తనిఖీ చేసారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు,డిఆర్డీఓ జి. రాంరెడ్డి, తహసిల్దార్లు పి.శ్రీనివాస్, బి.వీరస్వామి, ఎంపిడీఓ సురేందర్, డా.కరుణాకర్ రాజు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post