యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులు పంటల కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

ఆదివారం వేసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు, వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియపై వ్యవసాయ, ఉద్యాన, సహాకార, జిసిసి, డిఆర్డిఓ, మార్కెటింగ్, జిల్లా పౌర సరఫరాలు, డియం పౌర సరఫరాల సంస్థ, రెవిన్యూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జితో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. యాసంగి యాక్షన్ ప్రణాళికపై 67 క్లస్టర్లులోని ఏఈఓలు అన్ని గ్రామాల్లో రైతులతో గ్రూపు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. వేసంగిలో వరి సాగు చేయొద్దనే సమాచారం ప్రతి రైతుకు చేరాలని చెప్పారు. భారత ప్రభుత్వం, ఎస్ సిఐ యాసంగి ధాన్యం కొనుగోలు చేయమని ఖరాఖండిగా చెప్పడం జరిగిందని, కాబట్టి యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఉండదని, వారికి బదులు ప్రత్యామ్నయ పంటల సాగు చేపట్టాలనే అంశంపై రైతువేదికలతో పాటు ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు కల్పించాలని, ఇంత చెప్పినా యాసంగిలో వరి సాగు చేస్తే అందుకు సాగుచేసిన రైతులే బాధ్యులనే సంక్షిప్త సమాచారం ప్రతి రైతుకు తెలియచేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలనే సమాచారం రైతులకు తెలియచేసేందుకు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాలపై షెడ్యూలు తయారు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సహాయ సంచాలకులు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పంటలసాగుపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని రైతులకు వివరించాలని చెప్పారు. ప్రతిరోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యవసాయ అధికారులు హాజరు నివేదికలు అందచేయాలని చెప్పారు. ప్రత్యామ్నయ పంటల సాగుపై రైతువేదికలతో పాటు ప్రతి గ్రామంలోని రైతుకు సమాచారం చేర్చాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని స్పష్టం చేశారు. రానున్న నాలుగు రోజుల్లో ప్రతి కుగ్రామంలోని రైతుకు ప్రత్యామ్నయ పంటల సాగు సమాచారం. తెలియచేసేందుకు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల్లో రైతులను కూడా భాగస్వాములను చేయాలని చెప్పారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల వచ్చే రాబడి గురించి కూడా రైతులకు తెలియచేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు గురించి ప్రస్తావిస్తూ ఈ వారం నుండి పెద్ద ఎత్తున దాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, సిబ్బంది కొనుగోళ్లులో ఇబ్బంది రాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొనుగోళ్లు చేపట్టే రైతులకు ముందస్తుగా టోకెన్లు పంపిణీ చేసి కేంద్రాల్లో నియంత్రణ పాటించు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సీజన్లో 2.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆర్డీఓ, సబ్ కలెక్టర్, తహసిల్దారులు, నాయబ్ తహసిల్దారులు: కొనుగోలు కేంద్రాలను తనఖీ చేసి కొనుగోళ్లు ప్రక్రియ పర్యవేక్షణ చేయాలని చెప్పారు. కేంద్రాల్లో ఏదేని సమస్య ఉత్పన్నం అయితే తక్షణం పరిష్కరించి కొనుగోళ్లకు ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ సజావుగా, సక్రమంగా జరగాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే కేటాయించిన మిల్లులకు రవాణా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సియంఆర్ లక్ష్యం ప్రకారం ప్రతి రోజు పిల్లింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దాన్యం కొనుగోళ్లులో జాప్యం చేయొద్దని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిను ఆదేశించారు. కొనుగోలు చేసిన ప్రకారమే ట్రక్ షీట్ జారీ చేయాలని, వ్యత్యాసం రావొద్దని, వ్యత్యాసం వస్తే సంబంధిత కేంద్రం ఇన్చార్డ్లు, సంబంధిత అధికారులను బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల దాన్యం మన జిల్లాకు రాకుండా సరిహద్దు చెకో పోస్టుల్లో 24 గంటలు పటిష్టమైన నిరంతర నిఘా కొనసాగాలని చెప్పారు. ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, డియం ప్రసాద్, డిఆర్డిఓ మధుసూదన్రాజు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, డిసిఓ వెంకటేశ్వర్లు. ఆర్డీఓ స్వర్ణలత, అన్ని మండలాల తహసిల్దారులు, కొనుగోలు కేంద్రాలు ఇన్చార్జ్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post