యాసంగిలో వరి పంటకు బదులు లాభదయాకమైన ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల రైతులకు సూచించారు.

యాసంగిలో వరి పంటకు బదులు లాభదయాకమైన ప్రత్యామ్నాయ ఆరుతడి  పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల రైతులకు సూచించారు.

యాసంగిలో వరి పంటకు బదులు లాభదయాకమైన ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల రైతులకు సూచించారు.

మంగళవారం ధారూర్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సూచించారు. కేంద్రంలో ప్యాడి క్లీనింగ్ యంత్రాన్ని, పనితీరును పరిశీలించారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతూ, ఈ యాసంగిలో కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయడంలేదని, కొనుగోలు కేంద్రాలు ఏర్పచేయడం లేదని స్పష్టంగా చెప్పినందున, రైతులు వరి పండించి నష్టపోకుండా, వరికి బదులు మండలంలో అనుకూలమైన రాగి, కుసుమలు, మనుములు, పెసర, నువ్వులు, జొన్నలు తదితర పంటలు పండించి మంచి లాభాలు అర్జీంచాలని సూచించారు. మార్కుఫెడ్ సంస్థ వారు ఇట్టి పంటలను మంచి ధరకు కొనుగోలు చేయుటకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ, చెరువు క్రింద ఉన్న 200 ఎకరాల భూమిలో ఇతర పంటలు వేయుటకు వీలు పడదని, మరియు కోతుల కారణంగా ఇతర పంటలు నష్టపోతున్నామని తెలుపగా, కలెక్టర్ స్పందిస్తూ కోతుల సమస్యలు తీరుస్తామని అలాగే ఇంటి వినియోగం కొసం మాత్రమే వరి పండించుకోవాలని రైతులకు సూచించారు. పంట మార్పిడికి తగిన సూచనలు సలహాలను వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తారని తెలిపారు. రైతులు వరి పండించి ఇబ్బందులు పడొద్దని ఈ సందర్బంగా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, మండల వ్యవసాయ అధికారి jyothi, తహసీల్దార్ భీమయ్య, సర్పంచ్ చంద్రమౌళి, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post