యాసంగిలో వరి పంట వేయవద్దని వరికి ప్రత్యామ్నయ పంటలు వేసి లాభపడాలని రైతులకు అవగహన కల్పించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.

యాసంగిలో వరి పంట వేయవద్దని వరికి ప్రత్యామ్నయ పంటలు వేసి లాభపడాలని రైతులకు అవగహన కల్పించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.

సోమవారం మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ జంగమ్మ, జనిగే కృష్ణ, బాలయ్య రైతులను పొలాల వద్ద కలిసి మాట్లాడుతూ భారత ప్రభుత్వం,భారత ఆహార సంస్థ (FCI) వరి ధాన్యం కొనుగోలు చేయదని స్పష్టం చేసినందున ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నయ పంటలు వేయాలని, కూరగాయలు పండించాలని సూచించారు.
ఇతర పంటలు పండించి ఆర్థికంగా లాభం పొందాలని రైతులకు తెలిపారు.

అనంతరం కందుకూరు మండలం గూడూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ రైతులతో మాట్లాడుతూ ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నయ పంటలు వేయాలని అన్నారు.
యాసంగిలో రైతులకు గిట్టుబాటు ధర లభించే పంటలు రైతులు వేసుకోని లాభం పొందాలని,తగు సూచనలు సలహాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులకు గోడ పత్రిక, బుక్ లెట్ ద్వారా కలెక్టర్ అవగాహన కల్పించారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కందుకూరు ఆర్డిఓ వెంకటాచారి, వ్యవసాయ శాఖ ఏఈలు కోటేశ్వర్ రెడ్డి, పి.యాదగిరి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post