యాసంగిలో వరి సాగుకు బదులుగా డిమాండ్ ఉన్న పంటల సాగును చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ రైతులకు సూచించారు.

బుధవారం పాల్వంచ మండలం, జగన్నాధపురం రైతుచేదికలో వ్యవసాయ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని భారత ఆహార సంస్థ ఖరాఖండిగా చెప్పడం జరిగిందని, అందువల్ల వేసవిలో దాన్యం కొనుగోలు కేంద్రాలు. ఏర్పాటు ఉందని, దాన్యం కొనుగోలు చేయమని చెప్పారు. యాసంగిలో పండిన ధాన్యాన్ని పారాబాయిల్డ్ రైస్ మార్చడం జరుగుతుందని, అట్టి పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేనందున రైతులు అర్ధం చేసుకుని వారికి బదులుగా ఇతర పంటల సాగును చేపట్టేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ, ఉదాన్యన అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని వారి సలహాలు, సూచనలు పాటిస్తూ వారికి బదులుగా ఇతర పంటల సాగును చేపట్టాలని చెప్పారు. ఆరుతడి పంటల సాగు వల్ల మంచి ఆదాయం సమకూరడంతో పాటు భూమి కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుందని చెప్పారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లుతో నిర్వహించిన సమావేశంలో యాసంగిలో వరి సాగు చేపట్టాద్దనే అంశంపై దిశానిర్దేశం కూడా చేశారని చెప్పారు. వరివేసి రైతులు ఇబ్బంది పడొద్దనే జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులను సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మార్పు కష్టంగా ఉన్నా, పాటిస్తే మార్పు మంచిదేనని అదొక అవకాశం లాగా తీసుకుని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కొనగోలు కేంద్రాలు ఉండవని, విత్తన కంపెనీలు, మిల్లర్లు నుండి ఒప్పందం ఉంటే తప్ప వరి సాగు చేపట్టార్దని చెప్పారు. వరిసాగు చేస్తే అందుకు రైతులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. భూమి ఆరుదల కావడం వల్ల కావాల్సినంత బలాన్ని సమకూర్చు కుంటుందని చెప్పారు. ఒక ఎకరం వరికి అయ్యే నీటితో దాదాపు 5 ఎకరాల వరకు ఆరుతడి పంటల సాగు చేయడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. రైతులందరూ ఒకే పంటలు సాగు చేయకుండా వివిధ రకాల పంటలు సాగు చేయడం వల్ల మార్కెట్లో మంచి మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. అనంతరం వారికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రూపొందించిన కరపత్రాలను వ్యవసాయ అధికారులు రైతులకు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి అభిమన్యుడు, తహసిల్దార్ స్వామి, యంపిడిఓ రవీందర్, రైతు సమన్వయ కమిటి కన్వీనర్ నాగేశ్వరావు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

Share This Post