యాసంగిలో 2.64 లక్షల ఎకరాలకు 23.832 టి ఎం సి ల నీటి విడుదలకు కమిటీ ఆమోదం – నిజాంసాగర్ ప్రాజెక్టు కింద డిసెంబర్ 15 నుండి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద డిసెంబర్ 25 నుండి నీటి విడుదలకు ఆమోదం- ధాన్యం సేకరణలో జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం- యాసంగి లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు, ఆలోచించి పంటలు సాగు చేయండి – వరి సాగు చేస్తే బై బ్యాక్ ఒప్పందం చేసుకోండి జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

 

ప్రస్తుత యాసంగి సీజన్ లో నిజామాబాద్ కామారెడ్డి ఇ జిల్లాల పరిధిలోని అన్ని ప్రాజెక్టుల కింద 2,64,832 ఎకరాలలో పంటల సాగుకు 23.832 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో ఆమోదించడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

శనివారం నాడు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన మంత్రి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో పాటు, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు తదితరులు హాజరైన ఈ సమావేశం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగవంతుని దయ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న పలు నిర్ణయాలు హరితహారం కాలేశ్వరం ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాలతో రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసే అన్ని ప్రాజెక్టులు చెరువులు కుంటలు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకొని అలుగులు పారినాయని యాసంగి కాలాన్ని కూడా ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటిమట్టం లతో కళకళలాడడం ఇందుకోసం ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని అందువల్ల రెండు జిల్లాల పరిధిలో గంటలకు నీటిని విడుదల చేయడానికి ఎటువంటి రంది లేదని, మంచి భరోసా ఉన్నదని పేర్కొన్నారు. అందువల్ల ఈ యాసంగి లో అటు రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ఇటు జిల్లాలోని శాసనసభ్యుల అభిప్రాయాలను తీసుకొని పూర్తిస్థాయి ఆయకట్టుకు నీటిని అందించడానికి ఎటువంటి సందేహం లేదన్నారు. నీరు పుష్కలంగా ఉన్నందున పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా నా విడుదలలో మార్పులు చేర్పులు చేయవలసి వస్తే నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి అధికారం ఇవ్వడం జరిగిందని వివరించారు. పంటలు మార్పు జరిగే అవకాశం ఉన్నందున రైతులు వేరే పంటలకు వెళితే వారిని ప్రోత్సహించాలని అధికారులను కోరారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద 43,242 ఎకరాల ఆయకట్టుకు 4.50 టీఎంసీలు నిజాంసాగర్ కింద 1,98,280 ఎకరాల ఆయకట్టుకు 16.50 టి ఎం సిలు, కౌలాస్ నాలా రామడుగు పోచారం ప్రాజెక్టుల కింద 25,280 ఎకరాలకు 2.832 టీఎంసీలు కల్పి మొత్తం 2,64,832 ఎకరాలలో యాసంగి పంటల సాగుకు 23.832 టీఎంసీలు నీటిని విడుదల చేయడానికి బోర్డు ఆమోదించిందని మంత్రి తెలిపారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆరు తడులుగా డిసెంబర్ 15 నుండి పదిహేను రోజులు నీటిని విడుదల చేస్తూ పది రోజుల విరామం ఇస్తూ 13 ఏప్రిల్ 2022 వరకు విడుదల చేయడానికి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా డిసెంబర్ 25 నుండి నిరంతరాయంగా 18 మే 2022 వరకు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు తడులుగా డిసెంబర్ 18 నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18 వరకు, అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా డిసెంబర్ 28 నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30 వరకు ఏడు తడులలో, పోచారం ప్రాజెక్టు ద్వారా జనవరి 1 నుండి ఏప్రిల్ 20 వరకు తొమ్మిది తడులుగా, కౌలాస్ నాలా ప్రాజెక్టు ద్వారా డిసెంబర్ 10 నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 6 వరకు 7 తడులతో, రామడుగు ప్రాజెక్టు నుండి 27 డిసెంబర్ నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వరకు 7 తడులతో నీటిని విడుదల చేయడానికి ఆమోదించినట్లు ఆయన తెలిపారు.

యాసంగి వరి సాగు పై రైతులకు విజ్ఞప్తి::–

యాసంగిలో ధాన్యాన్ని కొనే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం తెలియ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని, ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి మన చేతిలో లేదని, రైతులు అర్థం చేసుకోవాలని, అందువల్ల రైతులు ఆలోచించి పంటలను సాగు చేయాలని మంత్రి కోరారు. ఏ పంట వేస్తే తనకు లాభసాటిగా ఉంటుందో, అనువుగా ఉంటుందో ఆలోచించి పంటల సాగుకు ముందుకు వెళ్లాలని, ఒకవేళ వరి సాగు చేస్తే రైస్ మిల్లర్లతో ముందుగానే బైబ్యాక్ ఒప్పందాలు చేసుకొని సాగుకు ముందుకు వెళ్లాలని, తినడానికి అవసరం మేరకు చూసుకోవాలని, లేదా విత్తనాల కొరకు సంబంధిత కంపెనీలు తీసుకునే విధంగా ఒప్పందాలు ఉంటేనే ముందుకు సాగాలని ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు.

వానకాలం వడ్ల కొనుగోలులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో గెలిచిందని ఇందుకు కృషి చేసిన రెండు జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులు ఎఫ్ సి ఐ సివిల్ సప్లై రవాణా రైస్ మిల్లర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలమే కాదు యాసంగి లో కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉండడం గమనిస్తే నీటిపారుదల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అందరి ఉద్దేశం రైతులు మంచి పంటలు పండించి, మంచి దిగుబడి, మంచి ధరలు పొందాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో నిజామాబాద్ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రావు, డిప్యూటీ సి ఈ అశోక్ కుమార్ , కామారెడ్డి సిఇ శ్రీనివాస్, రెండు జిల్లాల ఎస్ ఇ లు బద్రి నారాయణ, కరుణాకర్, వాసంతి, ఆర్ డి వో లు రాజేశ్వర్, రవి, శ్రీనివాస్, కామారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్, బాన్స్వాడ ఆర్డివో రాజా గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, ప్రజా ప్రతినిధులు, అధికారులు కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

 

Share This Post