యాసంగి తాయి బంద్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ……. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లాలోని భారీ, మధ్య మరియు చిన్న నీటి వనరుల కింద యాసంగిలో పంటల సాగుకు నీటి విడుదల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.

యాసంగి తాయి బంద్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
……. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

జిల్లాలోని భారీ, మధ్య మరియు చిన్న నీటి వనరుల కింద యాసంగిలో పంటల సాగుకు నీటి విడుదల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.

గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నారాయణఖేడ్, ఆందోల్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్ ల ఆధ్వర్యంలో నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులతో ఇరిగేషన్ అడ్వైజరి బోర్డ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో యాసంగి పంటలకు భారీ,మధ్య,చిన్న నీటి ట్యాంకుల పరిధిలో ఆయకట్టుకు నీటి విడుదలపై శాసనసభ్యులు పలు సూచనలు, సలహాలు చేశారు.

సింగూర్ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు, నల్లవాగు ప్రాజెక్టు కింద 5100 ఎకరాలకు, ( 500 ఎకరాల పైబడిన) 15 చెరువుల కింద 4,427 ఎకరాల ఆయకట్టులో పంటల సాగుకు నీటిని విడుదల చేయడానికి అడ్వైజరి బోర్డ్ నిర్ణయించింది.

నీటిని రెగ్యులేట్ చేయాలని, సింగూర్, నల్లవాగు, చెరువుల మరమ్మత్తులు, మేజర్ వర్క్స్ ఏవైనా ఉంటే యాసంగికి నీటి విడుదలకు ముందే పూర్తి చేయాలని సూచించారు.

అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని ప్రాజెక్టులు, చెరువులలో పూర్తిస్థాయిలో నీరున్నదన్నారు. అందోల్, పుల్కల్ మండలాల్లో అన్ని చెరువులు నిండే ఉన్నాయని, యాసంగిలో కొత్తగా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

సింగూర్ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద వరి సాగయ్యే అవకాశముందని, సాగు చేసిన ఆయకట్టు రైతుల అవసరం మేరకు నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలని నీటి పారుదల అధికారులకు సూచించారు.

సాయిబాన్ పేట, చందంపేట, శివ్వంపేట, కొర్పోల్ చెరువులకు నీరు వెళ్లే కాలువల మరమ్మత్తులు చేయించాలని, నీరు సాఫీగా వచ్చేలా చూడాలని క్రాంతి కిరణ్ అధికారులకు సూచించారు. సింగూర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులు చేయించాలని సూచించారు. అదేవిధంగా నీటి ప్రవాహానికి ఆటంకం ఉన్నచోట కాలువలను మరమ్మత్తులు చేయించాలని , అందుకు ప్రతిపాదనలను పంపాలని సూచించారు.

నారాయణఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ
కాకి వాగు ప్రాజెక్టు,
ఉజలంపాడ్ ప్రాజెక్టు కాలువల మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. నల్ల వాగులో ఎమర్జెన్సీ కాల్వ సమస్య ఉందని దాన్ని బాగు చేయించాలని కోరారు.

గంగాపూర్, చాప్ట- బి, వాసర్, గట్టు లింగంపల్లి చెరువులకు కాలువ సిస్టం లేకపోవడంతో చెరువులు నిరుపయోగంగా ఉండి రైతులు పంటలు వేయలేకపోతున్నారని, కాలువ సిస్టం కావాలన్నారు. కాలువ సిస్టంతో చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు మంచిగా నీరు ఇవ్వవచ్చని సూచించారు. ఆయా అంచనా ప్రతిపాదనలను త్వరిత గతిన ప్రభుత్వానికి పంపాలన్నారు.

ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ ఈ మురళీధర్, ఈ ఇ లు మధుసూదన్ రెడ్డి, జై భీమ్, విజయ్ కుమార్, ఉమ్మడి జిల్లా ఇంజనీరింగ్ కన్సల్టెంట్ మల్లయ్య, వ్యవసాయ శాఖ జేడి నరసింహారావు, రెవిన్యూ డివిజనల్ అధికారులు నగేష్, రమేష్ బాబు, అంబదాస్ రాజేశ్వర్, నీటిపారుదల శాఖ డీఈలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post