యాసంగి పంట ఆయకట్టుకు నీళ్లు వదిలే విషయమై రేపు పి.జే.పి. క్యాంపు పెబ్బేరు లో ఐ.ఏ.బి సమావేశం నిర్వహించనున్నట్లు వనపర్తి సి.ఈ. రఘునాథ్ రావు నేడోక ప్రకటనలో తెలిపారు.

యాసంగి పంట ఆయకట్టుకు నీళ్లు వదిలే విషయమై రేపు పి.జే.పి. క్యాంపు పెబ్బేరు లో ఐ.ఏ.బి సమావేశం నిర్వహించనున్నట్లు వనపర్తి సి.ఈ. రఘునాథ్ రావు నేడోక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 2021-22 యాసంగి పంటకు జూరాల కుడి ఎడమ కాలువ, ఆర్.డి.ఎస్ కెనాల్, కోయిల్ సాగర్ , రాజీవ్ భీమా, ఎత్తిపోతల, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సాగు నీరు ఎప్పుడు వదలాలి, ఎంత పరిమాణంలో వదలాలి అనే అంశాల పై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని, ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిలువ, చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు తీసుకోవాల్సిన అంశాల పై ప్రాజెక్టు లెవల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లాల శాసన సభ్యులు, వ్యవసాయ అధికారులు తదితరులు సమావేశానికి హాజరు కానున్నట్లు తెలియజేసారు.

Share This Post