యాసంగి పంట ప్రణాళిక, ధాన్యం కొనుగోలు పై వీసి నిర్వహించిన సీఎస్


యాసంగి లో వరి సాగు వద్దు::రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్
బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయమని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి లో వరి సాగు నివారణ ఉత్తమం
రైతులు తమ సోంత పూచీకత్తు పై మాత్రమే వరి సాగు చేయాలి
పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
వానాకాలం పంట పూర్తి స్థాయిలో కోనుగోలు
ధాన్యం దళారుల పై కఠినంగా వ్యవహరించాలి
ధాన్యం కొనుగోలు, పంటల మా‌ర్పిడీ వంటి అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్
పెద్దపల్లి,నవంబర్ 27
:- రాబోయే యాసంగి సీజన్ లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట ప్రణాళిక వంటి అంశాల పై శనివారం అన్ని జిల్లా కలెక్టర్ లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1 కేజీ బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని సీఎస్ తెలిపారు రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి పంట బాయిల్డ్ రైస్ మాత్రమే తయారవుతుందని, కేంద్ర ప్రభుత్వం మరియు ఎఫ్.సి.ఐ బాయిల్డ్ రైస్ కోనుగోలు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదని సీఎస్ పేర్కొన్నారు. యాసంగి సీజన్ లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా రైతు వేదికలో వెంటనే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. రైతు యాసంగి సీజన్లో తన సోంత అవసరాలకు, విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం ఉంటే సోంత పూచికత్తు పై మాత్రమే వరి సాగు చేయాలని, ఈ సమాచారం వెంటనే క్షేత్ర స్థాయిలో రైతులకు తెలియజేయాలని సీఎస్ తెలిపారు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం సీఎస్ వానాకాలం వరి సాగు పై చర్చించారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, అవసరమైన ప్రదేశాల్లో అదనపు కోనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో వీలైనంత త్వరగా వానాకాలం వరి కోనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలని సీఎస్ సూచించారు వానాకాలం పంట కోనుగోలు పై దృష్టి సారించాలని, ప్రతి మండలానికి సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైన స్థాయిలో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు అధికంగా పెండింగ్ లో ఉన్న మండలాల్లో కలెక్టర్ వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సీఎస్ ఆదేశించారు జిల్లాలో పెండింగ్లో ఉన్న మిల్లింగ్ రైస్ లక్ష్యాలు పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 40 వేల మెట్రిక్ టన్నుల రైస్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సూర్యాపేట నల్గొండ సిద్దిపేట మెదక్ జగిత్యాల నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ జిల్లాలో అధికంగా మిల్లింగ్ రైస్ పెండింగ్ ఉందని వీరు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు సైతం ధాన్యం విక్రయిస్తున్నట్లు సమాచారం వస్తుందని, దీనిని పూర్తి స్థాయిలో నివారించాలని తెలిపారు. ధాన్యం దళారుల పై నిఘా ఏర్పాటు చేయాలని, చెక్పోస్టులను అప్రమత్తం చేయాలని డిజిపి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 289 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 74 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 10494 మంది రైతుల నుండి కొనుగోలు చేసి, వారిలో 2765 మందికి దాదాపు 35 కోట్ల నగదు అందజేశామని తెలిపారు.
అనంతరం కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటల సాగు పై పోస్టర్ ఆవిష్కరించారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ,డిసిపి రవిందర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తోట వెంకటేశ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, సంబంధిత అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గోన్నారు.

Share This Post