యాసంగి పంట వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం సేకరణ సాఫీగా జరిగేందుకు వీలుగా ఏప్రిల్, 30వ తేదీన సుఖఃజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లొ అవగాహన కార్యక్రమం – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

యాసంగి పంట వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం సేకరణ సాఫీగా జరిగేందుకు  వీలుగా ఏప్రిల్, 30వ తేదీన సుఖఃజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లొ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణలో  రైతులకు,  వరి కొనుగోలు కేంద్రాల ప్రతినిధులకు  మిల్లర్లకు ఇబ్బందులు కలుగకుండా  రాష్ట్ర ప్రభుత్వం సూచనలు, నిర్దేశాలపై మిల్లర్లకు, ధాన్యం రవాణా కాంట్రాక్టర్లకు, కొనుగోలు కేంద్రాల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి అవగాహన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు, ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు హాజరు కావాలని తెలియజేసారు.

Share This Post