యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి వానాకాలం పంట పూర్తి స్థాయిలో కోనుగోలు చేయాలి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.

యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

వానాకాలం పంట పూర్తి స్థాయిలో కోనుగోలు చేయాలి

పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.
00000

రాబోయే యాసంగి సీజన్ లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

వానాకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట ప్రణాళిక వంటి అంశాల పై శనివారం అన్ని జిల్లా కలెక్టర్ లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి పంట బాయిల్డ్ రైస్ మాత్రమే తయారవు తుందని, కేంద్ర ప్రభుత్వం మరియు ఎఫ్.సి.ఐ బాయిల్డ్ రైస్ కోనుగోలు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదని సీఎస్ పేర్కొన్నారు. యాసంగి సీజన్ లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా రైతు వేదికలో వెంటనే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను అయన ఆదేశించారు. రైతు యాసంగి సీజన్లో తన సోంత అవసరాలకు, విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం ఉంటే సోంత పూచికత్తు పై మాత్రమే వరి సాగు చేయాలని, ఈ సమాచారం వెంటనే క్షేత్ర స్థాయిలో రైతులకు తెలియజేయాలని సీఎస్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం సీఎస్ వానాకాలం వరి సాగు పై చర్చించారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, అవసరమైన ప్రదేశాల్లో అదనపు కోనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో వీలైనంత త్వరగా వానాకాలం వరి కోనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. వానాకాలం పంట కోనుగోలు పై దృష్టి సారించాలని, ప్రతి మండలానికి సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైన స్థాయిలో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు అధికంగా పెండింగ్ లో ఉన్న మండలాల్లో కలెక్టర్ వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సీఎస్ ఆదేశించారు జిల్లాలో పెండింగ్లో ఉన్న మిల్లింగ్ రైస్ లక్ష్యాలు పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 40 వేల మెట్రిక్ టన్నుల రైస్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు సైతం ధాన్యం విక్రయిస్తున్నట్లు సమాచారం వస్తుందని, దీనిని పూర్తి స్థాయిలో నివారించాలని తెలిపారు. ధాన్యం దళారుల పై నిఘా ఏర్పాటు చేయాలని, చెక్ పోస్ట్ లను అప్రమత్తం చేయాలని డిజిపి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
అన్ని జిల్లాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు ఇంటింటికి వెళ్లి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకున్నారా లేదా పరిశీలించి లేనిచో వ్యాక్సినేషన్ చేయాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికీ డబుల్ వ్యాక్సినేషన్ చేయాలని ఆయన సూచించారు.

Share This Post