యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ రామడుగు మండలం వెంకట్రావుపల్లె లో ప్రత్యామ్నాయ పంటలు పరిశీలించిన కలెక్టర్

యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

రామడుగు మండలం వెంకట్రావుపల్లె లో ప్రత్యామ్నాయ పంటలు పరిశీలించిన కలెక్టర్

0000000

యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు మేలు కలుగుతుందని,అలాగే భూసారం కూడా పెరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.

సోమవారం రామడుగు మండలం లోని వెంకట్రావుపల్లె గ్రామంలో రైతులు వేసిన మొక్కజొన్న పంటను కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయదని తెలిపారు. యాసంగి లో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని అన్నారు. మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు మాత్రమే వరి పంట వేసుకోవాలని సూచించారు. ఒప్పందం చేసుకోని రైతులు వరి పంట వేసుకుంటే ధాన్యాన్ని సొంతంగానే అమ్ముకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మొక్కజొన్న పంటకు చీడ పురుగులు ఆశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. వరికి బదులు మినుములు, కందులు, జొన్నలు, నువ్వులు తదితర లాభసాటి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి సరిపడా విత్తనాలను రైతులకు అందిస్తామని కలెక్టర్ అన్నారు. పంట మార్పిడి కి తగిన సూచనలు సలహాలు కూడా వ్యవసాయ అధికారులు రైతులకు అందిస్తారని కలెక్టర్ అన్నారు. ఖరీఫ్ లో రైతులు వరి పంటలు వేసుకొని, యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటేనే రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుందని కలెక్టర్ అన్నారు. పంట మార్పిడి వల్ల భూమి సారవంతం అవుతుందని తెలిపారు. యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే కూడా రైతులకు యధావిధిగా రైతు బీమా అందుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, రామడుగు మండలం ఎంపీడీవో మల్హోత్ర, ఎమ్మార్వో కోమల్ రెడ్డి, ఏ డి ఏ రామారావు, ఏఈఓ యాస్మిన్ రైతులు తదితరులు ఉన్నారు.

అనంతరం కలెక్టర్ రామడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. కోవిడ్ మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషన్ ఎంత వరకు అయ్యాయని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. మండలంలోని వెలిచాల,దేశారాజ్ పల్లి దేశ రా రామడుగు లో 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని వైద్య అధికారిని ఆదేశించారు.

Share This Post