యాసంగి లో వరికి బదులు ప్రత్యమ్నాయ పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించారు.

యాసంగి లో వరికి బదులు ప్రత్యమ్నాయ పంటలు పండించే  విధంగా  రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు  మరియు ప్రొఫెసర్ జయశంకేర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కృషి  విజ్ఞాన కేంద్రం మదనాపురం నుండి వచ్చిన శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన  సమావేశం లో కలెక్టర్  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రిగారి  సూచనల  మేరకు  మండల వ్యవసాయ అధికారులు గ్రామాలలో పంటల సాగు పై పక్కా ప్రణాళికను తయారు చేసి,  రైతులు యాసంగి సీజన్ లో వరి సాగుకు బదులుగా  ప్రత్యమ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, తదితర పంటలు పండించేలా, భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యమ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలియజేయాలని అన్నారు.  గ్రామాలలో మొత్తం రైతులు ఎంత మంది ఉన్నారు, ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు,  ముందు ఎ పంటను పండించారు, ఇప్పుడు ఏ పంటలు  పండిస్తున్నారని మొత్తం వివరాలతో జాబితా తయారు చేయాలనీ అన్నారు. భారత ఆహార సంస్థ(FCI) వరిని సేకరించడం లేదని, రైతులు వరి సాగును తగ్గించి ఇతర పంటల పై దృష్టి సారించాలని అన్నారు. గ్రామాలలో రైతు వేదికలలో సమావేశాలు  నిర్వహించి అధనపు కలెక్టర్ , ఆర్.డి.ఓ., వ్యవసాయ, ఉద్యానవన శాఖల మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, అందరు రైతు వేదికల సమావేశాలలో పాల్గొని ఏ పంటలు పండిస్తే మంచిదని రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు . రేపటి నుండి ప్రారంభించి అక్టోబర్ 29 వరకు 4 రోజులలో అన్ని గ్రామాలలో రైతు వేదిక సమావేశాలు పూర్తి చేయాలనీ అన్నారు. గ్రామం లో ఉన్న రైతులందరు రైతు వేదిక సమావేశాలలో పాల్గొనేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. మండలాల్లో మొత్తం రైతు వేదికలు, క్లస్టర్స్ ఎన్ని ఉన్నాయి, శాస్త్రవేత్తలు ఎంత మంది ఉన్నారు అనేది   ఎ.ఇ.ఓ లు గ్రామాల వారిగా లిస్టు తయారు  చేసి, ఈ నెల 29  వరకు రైతు వేదిక సమావేశాలను పూర్తి చేయాలనీ అన్నారు. ఎ.ఇ.ఓ లు రైతులకు అందుబాటులో ఉండి సాగులో వారికి తగిన సలహాలు, సూచనలు చేయాలనీ, విత్తనాల నాణ్యత పై, పంటలకు మార్కెట్ లో ఉండే ధరలు, వచ్చే లాభాల గురించి పూర్తి వివరాలు స్పష్టంగా రైతులకు చెప్పాలని, శాస్త్రవేత్తలతో సాగు పద్ధతులను వివరించాలని అన్నారు. అదేవిధంగా కూరగాయలు పండించేలా ప్రోత్సహించాలని ఉద్యానవన అధికారులను కోరారు.

సమావేశం లో  వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, ఉద్యానవన శాఖ అధికారి సురేష్, మదనాపురం కృషి  విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సురేష్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త రామకృష్ణ బాబు, మండల ఎ.ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–     జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే  జారీ చేయడమైనది.

 

 

 

Share This Post