*యాసంగి లో వరి కి బదులు మార్కెట్ డిమాండ్ పంటలు వేయాలి *యాసంగి లో కేంద్రం గింజ కొనే పరిస్థితి లేదు *వానా కాలం ధాన్యం సేకరణ కు ఏర్పాట్లు:రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీశ్ రెడ్డి

   మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు  వ్యవసాయ అధికారులు అవగాహన కలిగించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వ్యవసాయ,సహకార శాఖ,పోలీస్ శాఖల అధికారులు, మిల్లర్ ల తో మంత్రి యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలు,వానాకాలం ధాన్యం కొను గోలు పై సమీక్షించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.కరోనా కాలంలో కుడా రైతు కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసిందని,క్షేత్ర స్థాయిలో ధాన్యం సేకరణ లో కృషి చేసిన అన్ని శాఖల అధికారులను అభినందించారు. వచ్చే యాసంగి లో వరి కొనుగోలు చేసే పరిస్థితి లేదని,కేంద్రం స్పష్టం చేసినందున, రైతులను మార్కెట్ లో ధర లభించే వరి కి బదులు ఇతర పంటలను వేసేలా రైతులను చైతన్య వంతం చెయాలని మంత్రి అన్నారు. కేంద్ర సంస్థలు fci వరి కొనుగోలు చేసే పరిస్థితి లేదని,ఇప్పటికే గోదాం లలో 3 సం. లకు సరిపడా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని ఆయన అన్నారు.యాసంగి లో ఒక్క గింజ కొనే పరిస్థితి లేదని,వ్యవసాయ అధికారులు ప్రతి రోజు గ్రామాల్లో పర్యటించి రైతుల తో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు.
        రాష్ట్ర ముఖ్య మంత్రి సూచనల మేరకు మండల వ్యవసాయ అధికారులు, పంటల సాగుపై ప్రణాళికలను తయారు చేసి, రైతులు యాసంగి సీజన్ లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్, మినుములు, శనగ, వేరుశనగ, ఆముదం, నువ్వులు, పెసర,  తదితర పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.మినుములు మద్దతు ధరకు నాఫెడ్ సంస్థ కొనుగోలు చేస్తుందని,మినుములు పంట సాగు ప్రోత్సహించాలని అన్నారు.  భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించి, ప్రత్యమ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలియజేయాలని ఆయన సూచించారు. గ్రామాలలో మొత్తం ఎంత మంది రైతులు ఉన్నారు, ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు,  ఏ ఏ పంటను పండించారు, ప్రస్తుతం ఏ పంటలు  పండిస్తున్నారని వివరాలతో వారికి మార్కెట్ పరిస్థితులు తెలిపే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.వానాకాలం పంట కొనుగోలు పై రైతులకు టోకెన్ లు జారీ చేసి క్రమ బద్దీకరణ చేయాలని అన్నారు. అదేవిధంగా కూరగాయలు పండించేలా ప్రోత్సహించాలని, ఉద్యానవన అధికారులను  కోరారు.
        సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.ఏ. వి.రంగ నాథ్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్. భాస్కర్ రావు,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాం చంద్ర నాయక్,మున్సిపల్ కమిషనర్ సైది రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారిని సంగీత లక్ష్మి,జిల్లా సహకార అధికారి ప్రసాద్,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వరరావు, మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్,జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి,  వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post