యాసంగి లో వరి ధాన్యం సాగు వద్దు* **వరి బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి::: :జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

నల్గొండ, నవంబర్ 30. యాసంగి లో వరిని సాగు చేయవద్దని,వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని,రైతులు ఈ విషయం గమనించి వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని రైతాంగానికి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.మంగళ వారం జిల్లా కలెక్టర్ నల్గొండ పట్టణంలో అర్జాల బావి వద్ద పి.ఏ.సి.ఎస్.వరి దాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర భారత ఆహార సంస్ధ( FCI) యాసంగి లో పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేసిందని,  రైతాంగం వరి కి బదులు లాభదాయకం,మార్కెట్ లో మంచి ధర లభించే ప్రత్యామ్నాయ పంటల సాగు పై దృష్టి సారించాలని రైతాంగం కు జిల్లా కలెక్టర్ సూచన చేశారు.విత్తన కంపెనీ లు ,మిల్లర్ల తో ఒప్పందం ఉంటే తప్ప రైతు తమ స్వంత పూచీ కత్తు పై మాత్రమే వరి సాగు చేయాలని  అన్నారు.వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.యాసంగి లో వరి కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ఉండదని,రైతులు ఈ విషయం గమనించి
రైతులు ఆదాయం లభించే వేరు శెనగ, పెసర్లు, నువ్వులు, బొబ్బర్లు ,మినుములు ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేసుకోవాలని అన్నారు.ఓపెన్ మార్కెట్ లో ధర లభించే సాంప్రదాయ ఆముదం,ఆవాలు పంట పై కూడా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి రైతులు జిల్లాలో  సాగు చేయవచ్చని అన్నారు.కూరగాయలు సాగు కూడా చేసుకోవచ్చని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందని అన్నారు.
     వానాకాలం సీజన్ లో జిల్లాలో 239 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం.22,333.రైతుల నుండి కొనుగోలు చేసి రైతుల ఖాతా ల్లో 84 కోట్ల రూ.లు  జమ చేసినట్లు జిల్లా కలెక్టర్  వెల్లడించారు. వానాకాలం ధాన్యం సేకరణ లో రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీ గా ధాన్యం కొనుగోలు కు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.అన్ని కొను గోలు కేంద్రాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటు లో ఉన్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రం లో ఇప్పటి వరకు జరిపిన కొనుగోళ్లు, యాసంగి లో కొనుగోళ్లు,డేటా ఎంట్రీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతులతో కూడా మాట్లాడి పంట దిగుబడి,ఆధార్ తో ఫోన్ నంబర్ అనుసంధానం గురించి అడిగారు.ధాన్యం తేమ శాతం తేమ యంత్రం తో కొలిచారు. రైతు ఆధార్ నంబర్ తో రైతు వివరాలు ట్యాబ్ ఎంట్రీ  జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యం ను తూకం వేసి సంబంధిత మిల్లులకు రవాణా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ట్యాబ్ ఎంట్రీ లో రైతుల వివరాలు త్వరిత గతిన నమోదు చేయాలని అన్నారు.
అర్జాల బావి వరి కొనుగోలు  కేంద్రం లో  ఇప్పటి వరకు 6000 మెట్రిక్ టన్ను లు ధాన్యం కోనుగోలు చేసినట్లు,యాసంగి లో 14,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేసినట్లు,గత  వానాకాలం లో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసినట్లు అధికారులు జిల్లా కలెక్టర్ కు  వివరించారు.90 శాతం కోతలు పూర్తి అయినట్లు,50 శాతం కొనుగోలు చేసినట్లు జిల్లా సహకార అధికారి వివరించారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓ.పి.యం.ఎస్ లో రైతు వివరాలు నమోదు చేయాలని అన్నారు.
*రైతులు తమ ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి*                 రైతులు తమ ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని, ఓ.పి.ఎం.ఎస్.లో రైతు వివరాలు నమోదు చేసినప్పుడు రైతు ఫోన్ నంబర్ కు ఓ.టి.పి.వస్తుందని, ఓ.టి.పి.నమోదు చేస్తేనే చెల్లింపు జరుగుతుందని అన్నారు.
రైతులు తమ ఫోన్ నంబర్ మారితే మీ సేవ లేదా సమీప పోస్ట్ ఆపీస్ లో  తమ ఫోన్ నంబర్ ను ఆధార్ నంబర్ తో ఆప్ డేట్  చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా సహకార అధికారి ప్రసాద్,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,పౌర సరఫరాల సంస్థ డి.యం.నాగేశ్వరరావు, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం,పౌర సరఫరాల డి.టి.లు,సెంటర్ ఇంచార్జి లు ఉన్నారు.

*యాసంగి లో వరి ధాన్యం సాగు వద్దు*
**వరి బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి :జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

Share This Post