యాసంగి లో వరి వేయవద్దు* **వరి బదులు ప్రత్యామ్నాయ పంటల పై రైతాంగం దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్* # జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వ్యవసాయ అధికారులు,ఏ.ఈ. ఓ.లు,ఉద్యాన శాఖ అధికారులతో పంటల మార్పిడి పై జిల్లా కలెక్టర్ సమావేశం # భారత ప్రభుత్వ ఆహార సంస్ధ (FCI)యాసంగి లో వరి కొనటం లేదు #రైతాంగానికి వ్యవసాయ,ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పించి,చైతన్యం చేయాలని కలెక్టర్ సూచన

నల్గొండ, ఆక్టోబర్ 25.వచ్చే యాసంగి లో (రెండవ పంట)గా వరిని సాగు చేయవద్దని రైతాంగానికి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని ఉదయాదిత్య భవన్ లో వ్యవసాయ శాఖ ఏ.డి. లు, వ్యవసాయ శాఖ అధికారులు,వ్యవసాయ విస్తరణ అధికారులు,ఉద్యాన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి యాసంగి సీజన్ లో పంటల మార్పిడి పై చర్చించి సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర భారత ఆహార సంస్ధ( FCI) యాసంగి లో వరిని కొనటం లేదని,వరి కి మార్కెటింగ్ ఉండదని, ఈ విషయం పై  సమాచారం తెలిపినందున,  రైతాంగం వరి కి బదులు లాభదాయకం,మార్కెట్ లో మంచి ధర లభించే ప్రత్యామ్నాయ పంటల సాగు పై దృష్టి సారించాలని రైతాంగం కు జిల్లా కలెక్టర్ సూచన చేశారు.రైతులు ఆదాయం లభించే వేరు శెనగ, పెసర్లు, నువ్వులు, బొబ్బర్లు  ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేసుకోవాలని అన్నారు.మినుములు సాగు చేసుకుంటే నాఫెడ్ సంస్థ కనీస మద్దతు ధర కు కొంటుందని,ఈ విషయం రైతులు గమనించి పంట వేసుకోవచ్చని తెలిపారు.ఓపెన్ మార్కెట్ లో ధర లభించే సాంప్రదాయ ఆముదం,ఆవాలు పంట పై కూడా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి రైతులు జిల్లాలో  సాగు చేయవచ్చని అన్నారు.ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందని,జిల్లాలో 700 ఎకరాలు పంట సాగు లక్ష్యం గా నిర్ణయించినట్లు వెల్లడించారు.రైతులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని,క్షేత్ర స్థాయి లో ఉద్యాన శాఖ అధికారులకు ఆయిల్ ఫామ్ సాగుకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.ఆయిల్ ఫామ్ సాగు పై ఎటువంటి సందేహాలు వున్నా జిల్లా ఉద్యాన శాఖ అధికారిని  సంగీత లక్ష్మీని 7997725341          మొబైల్ నంబర్ లో సంప్రదించ వచ్చని తెలిపారు.
*వ్యవసాయ క్లస్టర్ స్థాయి లో రైతుల తో సమావేశమై ప్రత్యామ్నాయ పంటల సాగు పై ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన*
వ్యవసాయ క్లస్టర్ స్థాయి లో వ్యవసాయ శాఖ అధికారులు,ఏ.ఈ. ఓ.లు, ఉద్యాన శాఖ అధికారులు వచ్చే మూడు రోజుల్లో సమావేశం జరిపి చర్చించి వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారని అన్నారు.వ్యవసాయ అధికారులు రైతులను చైతన్యవంతం చేసి అవగాహన  కల్పించాలని కలెక్టర్ కోరారు.ప్రత్యామ్నాయ పంటలు వేయుటకు అవసరమైన విత్తనాలు  ప్రైవేట్ డీలర్ ల ద్వారా అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ,రాష్ట్ర ప్రభుత్వం ,జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.ఈ నెల 29 న ప్రైవేట్ సీడ్ డీలర్ లు,వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారిని సంగీత లక్ష్మీ,వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం డి.డి.మోహన్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్ర వేత్త శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post