యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేష్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేష్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లావ్యాప్తంగా మొత్తం 109 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి రైతులకు ఇబ్బంది కలిగించదు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వై.వి గణేష్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని ఐకెపి 23, పిఎ సిఎస్ 74, జిసిసి 12, మొత్తం 109 కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు అందాయని వాటిని వెంటనే ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వై వి గణేష్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రబీ 2021_ 22 రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు సెంటర్ రబీ మార్పులు పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వై వి గణేష్ మాట్లాడుతూ రైతులు ధాన్యం సెంటర్కి తెచ్చిన తరువాత తేమ శాతం చూసి టోకెన్ ఇవ్వాలన్నారు.

ఏ ఈ ఓ టోకెన్ ఇచ్చిన రైతులకు మాత్రమే ఏవో గన్ని రీప్లేస్ చేయాలన్నారు.

సెంటర్ వారు లారీ ట్రాన్స్పోర్ట్ కి జిల్లా సివిల్ సప్లై ఆఫీస్ కి కాల్ చేస్తే లారీ పంపడం జరుగుతుంది అన్నారు.

సెంటర్లలో కోవిడ్ నిబంధనలు పాటించాలి అన్నారు. మాస్కులు శానిటైజర్, నీడ టెంట్, మంచి నీరు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

ప్రతి సెంటర్ కి ట్యాబ్ ఆపరేటర్ తప్పనిసరి ఈ సీజన్లో వరి క్వాంటిటీ లారీలో పంపేటప్పుడు పాత గన్ని సంచులు కాకుండా కొత్త గన్ని బ్యాగులు ఉపయోగించాలని దొడ్డు ధాన్యం సన్న ధాన్యం వేర్వేరుగా పంపాలని ట్రాక్ చిట్టి పై రాయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో కె రమాదేవి మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలిగించవద్దని సెంటర్ వద్ద ఇన్చార్జులు అప్రమత్తంగా ఉండి రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయాలని వారి ధాన్యం వివరాలు జాగ్రత్తగా ఆన్లైన్ చేయాలని అని అన్నారు.

జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లు చేసి ప్రతి సెంటర్ పగడ్బందీగా నిర్వహించేలా జాగ్రత్త వహించాలన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని అందుకు చాలా బాధ్యతగా పనిచేయాలన్నారు.

జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య వరి ధాన్యం కొనుగోలు కేంద్రం అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల పై ఎలాంటి ఇబ్బందులు రావద్దని ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకు పోతానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతులకు మేలు చేస్తున్నారని యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు లాభసాటిగా ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని వారు సూచించారు. త్వరలో రైస్ మిల్లర్ల తో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది జరగకుండా రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ దృష్టికి తీసుకు పోతామని అన్నారు.

ఈ అవగాహన సమావేశం లో సివిల్ సప్లై ఇన్చార్జ్ జిల్లా మేనేజర్ అధికారి రాములు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్, జి సి సి డి ఎం ప్రతాప్ రెడ్డి, జిసిసి మేనేజర్ దేవ్ సింగ్, డి సి ఓ సర్దార్ సింగ్, డిపిఎం గోవింద్ చౌహన్ ఏపిడి వెంకటనారాయణ, ఐకెపి సెంటర్ ఇన్చార్జిలు ఏ ఈ ఓ లు ఏవో లు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share This Post