: యాసంగి వారికి బదులు ఆరుతడి పంటల సాగు పై వ్యవసాయ అధికారులతో జరిగిన సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా)

యాసంగి సీజన్ లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి.

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్
OOo
యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ .వి కర్ణన్ అన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో యాసంగి సీజన్ లో వరికి బదులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్ లో రైతులు ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని భారత ప్రభుత్వం ఎఫ్ .సి .ఐ ద్వారా కొనడం లేదని అన్నారు. అందువల్ల యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలిపారు. ఈ యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించినప్పటికీ వరి సాగుకు వెళ్లే రైతులు పంటను అమ్ముకునేందుకు సొంతంగా, ఏర్పాట్లు చేసుకోవాలి అని సూచించాలని తెలిపారు.
రైస్ మిల్లర్లు నుండి సీడ్ కంపెనీల నుండి అగ్రిమెంట్ ఉన్న రైతులు వరి వేసుకోవచ్చు నని తెలపాలని అన్నారు. వ్యవసాయ అధికారు లందరూ సోమవారం నుండి వారం రోజుల్లోగా ప్రతి గ్రామంలో ప్రతి రైతును కలిసి యాసంగి లో వరికి బదులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

 

Share This Post