యాసంగి సీజన్‌ దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేయమన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పున:సమీక్షించుకోవాలి

– సిద్దిపేట జిల్లాలో వానాకాలం ధాన్యం పంట కొనుగోలుకు 396 వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

– అన్ని గ్రామాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

– వానాకాలంలో రికార్డ్ స్థాయిలో 3 లక్షల 3 వేల ఎకరాలలో వరి సాగు

– 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి

– కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు బంధు పంట పెట్టుబడి ఆర్థిక సహాయం తో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగింది.

-కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా బోర్లా నుండి నీరు ఉబికి వస్తుంది

– ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 6 మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల గోదాం లు ఉండగా, రాష్ట్రం ఏర్పడ్డాక 35లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం లను నిర్మించాం

– రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక కృషి వల్లే తెలంగాణ లో వ్యవసాయం సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగింది.

– ఎంత పంట వచ్చిన కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది

– వడ్ల కొనుగోలు కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదు

– యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది

– యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం కు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది

– యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనమని చెప్పడం సరికాదు

– ఈ విషయాన్ని కేంద్రం పున: సమీక్షించాలి

– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

ఈ యాసంగి సీజన్‌నుంచి దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) తేల్చి చెప్పిన దృష్ట్యా రైతుల ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం , ఎఫ్‌సీఐ లు తమ నిర్ణయాన్ని పున : సమీక్షించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేసారు .
సోమవారం సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు .

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాలో వానాకాలం ధాన్యం పంట కొనుగోలుకు 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్ తెలిపారు. అన్ని గ్రామాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. వానాకాలంలో రికార్డ్ స్థాయిలో 3 లక్షల 3 వేల ఎకరాలలో వరి సాగు చేపట్టగా 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని పేర్కొన్నారు. ఎంత పంట వచ్చిన కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సకాలంలో రైతు ఖాతాలో కొన్న ధాన్యం కు సంబంధించి డబ్బులు చేలిస్తామని తెలిపారు .

కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు బంధు పంట పెట్టుబడి ఆర్థిక సహాయంతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందని తెలిపారు. గతంలో రైతులు సాగునీటి కోసం ఇబ్బడిముబ్బడిగా బోర్లు వేసి అప్పుల పాలయ్యేవారని అన్నారు . క్వాలిటీ లేని విద్యుత్ సరఫరా వల్ల ట్రాన్స్ఫార్మర్ లు , కరెంట్ మోటారు లు తరచూ మరమ్మత్తులకు గురయ్యేవని అన్నారు . ఫలితంగా వీటి దుకాణాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లేదని అన్నారు . 24 గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సరఫరా , కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఈ దుకాణాలు మూడో వంతు తగ్గిందన్నారు. ద్వారా బోర్లా నుంచి నీరు ఉబికి వస్తుందన్నారు . సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 6 మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల గోదాంలు ఉండగా..రాష్ట్రం ఏర్పడ్డాక 35లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం లను నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు.
ఎంత పంట వచ్చిన కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వడ్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదన్నారు.

యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు . యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనమని చెప్పడం సరికాదు. ఈ విషయాన్ని కేంద్రం పున: సమీక్షించాలన్నారు .

వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఊరికే ప్రతిపక్ష నాయకులూ నోరు పారేసుకోవడం కాదని , కేంద్రాన్ని ఒప్పించి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేసేలా చేయాలని ప్రతి పక్ష నాయకులకు నేతలకు మంత్రి శ్రీ హరీశ్ రావు సూచించారు.

యాసంగిలో దొడ్ల వడ్ల పంట మాత్రమే పండుతుంది: మంత్రి శ్రీ హరీశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైతు పక్షపాత నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే తెలంగాణ లో సాగు ముఖచిత్రం మారిందని మంత్రి తెలిపారు . ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పంటకు అనుకూలం కాగా తెలంగాణ వరి పంట సాగుకు అనుకూలమని మంత్రి తెలిపారు . సాగు నీటి సౌకర్యం మెరుగు పడడంతో మెజారిటీ రైతులు వరి పంట ను , ప్రధానంగా వడ్ల ధాన్యం పంటను సాగు చేస్తున్నారని తెలిపారు . వానాకాలం వరి పంట ను రా రైస్ , బాయిల్డ్ రైస్ గా మార్చవచ్చని అన్నారు . నూకలు కూడ తక్కువగా వస్తాయన్నారు . అదే యాసంగి సీజన్ లో వరి పంట ను రా రైస్ గా మార్చడం వల్ల రైతులకు అధిక నష్ట వాటిల్లుతుందన్నారు. అధికభాగం నూకలుగా మారుతుందన్నారు. వానాకాలం దొడ్డు వడ్ల ఉత్పత్తి కి , బాయిల్డ్ రైస్ గా మార్చేందుకు అనుకూలని మంత్రి తెలిపారు . ఇక నుంచి యాసంగి లో తెలంగాణ నుంచి దొడ్డు వడ్లు కొనడం సాధ్యం కాదని కేంద్రం ,fci స్పష్టం చేయడం తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ్‌ రెడ్డి, సీపీ శ్రీ జోయల్ డెవిస్ ,AMC చైర్మన్ శ్రీ పాల సాయిరాం తదితరులు ఉన్నారు.
అంతకుముందు సిద్దిపేట పట్టణం పొన్నాల లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి, సిపి శ్రీ జోయల్ డేవిస్ లతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పరిశీలించారు.

Share This Post