యాసంగి 2020-21లో (ఎఫ్.సి.ఐ) వరి ధాన్యాన్ని కొనుగోలు చేయదు బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 25: యాసంగిలో వరి ధాన్యంను (ఎఫ్ సి ఐ) భారత ఆహార సంస్థ కొనుగోలు చేయడం లేనందున వరికి బదులు ప్రత్యమ్నాయ పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ హాలు నందు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మండల ప్రత్యేక అధికారులు, ఏఏఓ లతో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ, మండల వ్యవసాయ అధికారులు గ్రామాలలో పంటల సాగు పై పక్కా ప్రణాళికను తయారు చేసి, రైతులు యాసంగి సీజన్ లో వరి సాగుకు బదులుగా ప్రత్యమ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, తదితర (12) రకాల పంటలు పండించేలా, భూముల లక్షణాలకు అనుగుణంగా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యమ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలియజేయాలని అన్నారు. గ్రామాలలో మొత్తం రైతులు ఎంత మంది ఉన్నారు, ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు, ముందు ఎ పంటను పండించారు, ఇప్పుడు ఏ పంటలు పండిస్తున్నారని మొత్తం వివరాలతో జాబితా తయారు చేయాలనీ అన్నారు. భారత ఆహార సంస్థ(ఎఫ్ సి ఐ) వరిని సేకరించడం లేదని, రైతులు వరి సాగును తగ్గించి ఇతర పంటల పై దృష్టి సారించాలని అన్నారు. గ్రామాలలో రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి వ్యవసాయ, ఉద్యానవన శాఖల మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు రైతు వేదికల సమావేశాలలో పాల్గొని ఏ పంటలు పండిస్తే మంచిదని రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు . ఈ నెల 26 నుండి 29 వరకు 4 రోజులలో అన్ని గ్రామాలలో రైతు వేదిక సమావేశాలు ఏర్పాటు చేయాలనీ అన్నారు. గ్రామంలో ఉన్న రైతులందరు రైతు వేదిక సమావేశాలలో పాల్గొనేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. మండలాల్లో మొత్తం రైతు వేదికలు, క్లస్టర్స్ ఎన్ని ఉన్నాయి, శాస్త్రవేత్తలు ఎంత మంది ఉన్నారు అనేది ఎ.ఇ.ఓ లు గ్రామాల వారిగా లిస్టు తయారు చేసి, ఈ నెల 29 వరకు రైతు వేదిక సమావేశాలను పూర్తి చేయాలనీ అన్నారు. ఎ.ఇ.ఓ లు రైతులకు అందుబాటులో ఉండి సాగులో వారికి తగిన సలహాలు, సూచనలు చేయాలనీ, విత్తనాల నాణ్యత పై, పంటలకు మార్కెట్ లో ఉండే ధరలు, వచ్చే లాభాల గురించి పూర్తి వివరాలు స్పష్టంగా రైతులకు చెప్పాలని, శాస్త్రవేత్తలతో సాగు పద్ధతులను వివరించాలని అన్నారు. అదేవిధంగా కూరగాయలు పండించేలా ప్రోత్సహించాలని ఉద్యానవన అధికారులను కోరారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ ఎ భాస్కర్ రావు, జనగామ ఆర్డిఓ మధు మోహన్,డిఎఓ టి.రాధిక, డి డి మాధవి, శాస్త్రవేత్తలు, ప్రత్యేక అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి జనగామచే జారీ చేయడమైనది.

Share This Post