యాసంగి 2020-21 సీఎంఆర్‌ త్వరితగతిన పూర్తిచేయాలి::::::: – అదనపు కలెక్టర్‌ వి.చంద్ర శేఖర్

జిల్లాలో ని రైస్ మిల్లర్లు 2020-21 సంవత్సరపు యాసంగి పెండింగ్ సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) డెలివరీ జూన్ 30 లోగా పూర్తి చేయాలని  అదనపు కలెక్టర్‌ వి.చంద్ర శేఖర్ మిల్లర్ లను ఆదేశించారు.ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించిందని,ఇంకా 6 మిల్లు లు 12000 మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్ డెలివరీ చేయాలని,జూన్ 30 లోగా పూర్తి చేయాలని అన్నారు . యాసంగి 2021-22 లో ఇప్పటి వరకు 3,26,700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు,దాదాపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావచ్చినట్లు తెలిపారు.ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానంధం తదితరులు పాల్గొన్నారు
శుక్రవారం పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) లక్ష్యం మేరకు భారత ఆహార సంస్థ కు అందజేత పై IDOC మీటింగ్ హల్ లో జిల్లా అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీ ఖిమ్యా నాయక్ మాట్లాడుతూ…..
ప్రస్తుత యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు జిల్లాలో ప్రారంభమైనందున మిల్లర్ లు తమ వద్ద ఉన్న ధాన్యం మిల్లింగ్ ను వేగవంతం చేయాలన్నారు.
గత రబి సీజన్ బియ్యాన్ని
సీఎంఆర్‌ పూర్తికి నిర్దేశించిన గడువు ఇప్పటికే ముగిసినందున .. త్వరితగతిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీ హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
యాసంగి 2020-21 సీఎంఆర్‌ త్వరితగతిన పూర్తిచేయాలి
– అదనపు కలెక్టర్‌ వి.చంద్ర శేఖర్

Share This Post