యువజన వసతి గృహంను సత్వరమే వినియోగంలోకి తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాలులో యూత్ హాస్టల్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రు స్టేడియం ఎదురుగా ఉన్న యూత్ హాస్టల్ యొక్క ఆర్థిక పరిస్థితి పై కలెక్టర్ ఆరా తీసారు. యూత్ హాస్టల్ నిర్వహణ, రెంటల్ చార్జీలను అధికారాలు కలెక్టర్ కు కమిటి సభ్యులు వివరించారు.
ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ యుత్ హాస్టల్ ను తక్షణమే మరమత్తులు చేపట్టాలని తెలిపారు. నిధుల అంచనా కు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. యువత కు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా యువజన అధికారి అన్వేష్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్, ఎం ఎస్ ఎస్, కేయు కోఆర్డినేటర్ నారాయణ, నేషనల్ యూత్ అడ్వైజర్ పరుశరాములు, డిఆర్డీఓ ఏవో శ్రీనివాస్ రెడ్డి, సిడిపిఓ మధురిమ తదితరులు పాల్గొన్నారు.

Share This Post