యువజన సంఘాల నుండి దరఖాస్తుల ఆహ్వానం*

భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ నెహ్రూ యువ కేంద్రం నల్లగొండ వారి ఆధ్వర్యంలో క్రీడా సామగ్రి  పంపిణీ కొరకు యువజన సంఘాల నుండి దరఖాస్తులు ఆహ్వానం  నెహ్రూ యువ కేంద్రం లో అనుసందనమైన యువజన సంఘాలు. మహిళ మండలి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్టు నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి ప్రవీణ్ సింగ్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 వ తేదీ లోగా నెహ్రూ యువ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 30 యువజన సంఘాలకు. మహిళ మండలిలకు క్రీడా సామగ్రి ఇవ్వనునట్లు తెలిపారు. 2018 నుండి 2020 సంవత్సరంలో క్రీడా సామగ్రి తీసుకున్న యువజన సంఘాలు మహిళ మండలిలు అనర్హులు అని తెలిపారు. మరిన్ని వివరాలకు నెహ్రూ యువ కేంద్రం కార్యాలయంలో లేదా 9052798602 చరవణిని సంప్రదించాలని కోరారు.

Share This Post