యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ఎంత గానో ఉపయోగ పడుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు

వరంగల్
ప్రచురునార్ధం
యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ఎంత గానో ఉపయోగ పడుతాయని
జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
గురువారం రోజున కలెక్టర్ చాంబర్లో జిల్లా స్థాయి నైపుణ్య కమిటీ సమావేశం జిల్లా ఉపాధి కార్యాలయం, వరంగల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు
ఈ కమిటీ కి చైర్మన్ గా ఉన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని దృఢ సంకల్పంతో అనేక జాబ్ మేళాలు, నైపుణ్య కమిటీ సమావేశాలు నిర్వహిస్తుందని ఉన్నదని దానికి అనుగుణంగా జిల్లా స్కిల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు
సంకల్ప పథకం కింద స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఏ రంగం లో ఏ కోర్సులు ఏర్పాటు చేసినట్లయితే యువతకు, స్త్రీలకు ఉపయోగపడతాయో వాటిని ఎంపిక చేయాలని జిల్లా స్థాయి నైపుణ్యం కమిటీ సమావేశం సభ్యులను కలెక్టర్ ఆదేశించారు
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, కమిటీ మెంబర్, కన్వీనర్ జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి, జేడీ అగ్రికల్చర్,
జిల్లా పరిశ్రమల అధికారి, డి ఆర్ డి ఓ పి డి సంపత్ రావు ,లీడ్ బ్యాంక్ మేనేజర్, పిడి మెప్మా,. సంబంధిత సభ్యులు హాజరయ్యారు

Share This Post