యువత ఉపాధి రంగాలలో దూసుకుపోవాలి…

ప్రచురణార్థం

యువత ఉపాధి రంగాలలో దూసుకుపోవాలి…

మహబూబాబాద్, నవంబర్ 29:

ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాలను అర్హులైన యువత వినియోగించుకుని ఉపాధి రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ శశాంక యువత కు ఉద్బోధించారు.

సోమవారం పట్టణంలోని తొర్రూరు బస్టాండ్ ఎదురుగా భారతీయ స్టేట్ బ్యాంక్ భవనం పైభాగంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కిల్ ఎంపవర్మెంట్(RISE) వారి శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి రంగాలలో ఎస్సి, ఎస్టీ, మైనారిటీ లలోని నిరుపేద యువత రాణించేందుకు ఎంచుకున్న రంగాలలో నైపుణ్యత పెంచేవిధంగా ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలను చేపట్టిందన్నారు.

నేడు ఎస్సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టినందున అర్హులైన యువతీయువకులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. పోటీ ప్రపంచంలో యువత ముందడుగు వేసేందుకు నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. యువత ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలతో ఉపాధి పొందాలన్న సదుద్దేశంతో ప్రోత్సహిస్తున్నందున అర్హులైనవారు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. హైదరాబాద్, వరంగల్ వంటి మహానగరాలలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయని, కోరుకున్న రంగాలలో అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రయివేట్ రంగాలలో ఉద్యోగాలు పొందేవారు మార్కెట్ రంగాన్ని అవగాహన పరుచుకోవాలని తద్వారా ఉన్నతంగా ఎదిగేందుకు మార్గనిర్ధేశనం చేసుకోవచ్చునన్నారు.

ఈ సందర్భంగా శిక్షణ పొందేందుకు వచ్చిన యువతీయువకులకు నైపుణ్యం పెంచే పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు బాలరాజు, ఏ.ఓ.శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది

Share This Post