యువత క్రీడా రంగాల్లో రాణించాలి….. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

యువత క్రీడా రంగాల్లో రాణించాలి….. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

ప్రచురణార్థం

యువత క్రీడా రంగాల్లో రాణించాలి….. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

కేసముద్రం,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -03:

క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకొని యువత క్రీడా రంగాల్లో రాణించాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

శుక్రవారం కెసముద్రం మండలం కల్వల గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె.శశాంక తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడానికి క్రీడా ప్రాంగణాలు ఎంతో దోహదపడతాయి అని, యువత అత్యధిక సంఖ్యలో క్రీడా ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడా రంగాల్లో రాణించాలని తెలిపారు.

మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ తో కలిసి వాలీ బాల్, కబడ్డీ ఆడారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంటా సంజీవ్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, ఎంపిటిసి అశోక్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు యాకూబ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post