యువత గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

*యువత గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

*పాఠకులకు రెండు పూటలా ఉచిత భోజనం సదుపాయం
—————————–
పెద్దపల్లి, మార్చి – 21:
—————————–
యువత గ్రంథాలయాల సేవలను సద్వినియోగం చేసుకుంటూ పోటీ పరీక్షల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సూచించారు.

మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి లతో కలిసి తనిఖీ చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రంధాలయాలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని, పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ పుస్తకాలను అందుబాటులో ఉంచామని అన్నారు.

గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగ యువత కు రెండు పూటలా ఉచిత భోజన వసతితో పాటు జిల్లా కేంద్ర గ్రంథాలయ పనివేలలో మార్పులు తీసుకుని వచ్చి అధిక సమయం విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో గ్రంథాలయాల ఆవశ్యకతను గుర్తించి పని వేళలను మార్పు చేసి నిరంతరం కొనసాగే విధంగా, అంతేకాకుండా రెండు పూటలా ఉచిత భోజన వసతి సైతం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .

గొప్ప ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ముఖ్యంగా పాఠకులు, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post