యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి …. జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

డిసెంబర్ 3,4 న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవెల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం.
యువత తమ పేరుతో పాటు, కుటుంబ సభ్యులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడాలి.
విద్యా సంస్థల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు తమ విద్యా సంస్థలో అర్హత గల వారందరికీ ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలి. వసతి గృహాలలో ఉన్న విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.

**
జిల్లాలోని యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య నేడోక ప్రకటనలో కోరారు.
17 ఏళ్లు పైబడిన యువత తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు కోసం, ఓటరు కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 18 ఏళ్లు నిండడానికి ముందస్తు ప్రమాణం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని భారత ఎన్నికల సంఘం సూచించినందున 17 ఏళ్లు నిండిన వారు ముందుగానే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఉన్న 17 సంవత్సరాలు నిండిన విద్యార్థిని విద్యార్థులు ముందస్తుగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు.
ఓటర్ల జాబితా 2023 యొక్క ప్రస్తుత రౌండ్ వార్షిక సవరణ కోసం 2023 జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన పౌరులు ఎవరైనా కూడా ముసాయిదా ప్రకారం తేదీ నుండి ఓటరుగా నమోదు చేసుకోవడానికి ముందస్తు దరఖాస్తును సమర్పించవచ్చు అని తెలిపారు.

యువత తమతో పాటు ఇంట్లోని వారందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో, అలాగే డిసెంబర్ 8 వరకు తమ సమీప బి.ఎల్. ఓ లను సంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

కళాశాల ప్రధానోపాధ్యాయులు, నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించి తమ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని అడిగి అర్హత మేరకు ప్రతి విద్యార్థిని, విద్యార్థుల పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మీడియా ప్రతినిధులు సామాజిక మాద్యమాల ద్వారా ఎక్కువ ప్రచారం కల్పించి అర్హత గల వారందరూ ఓటర్ గా నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్ కోరారు. స్వచ్ఛంద సంఘ సభ్యులు, ప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు అందరూ తమ పరిధిలో అర్హత కలిగి ఓటర్ గా నమోదు చేసుకోకుండా వున్న వారిని గుర్తించి అవగాహన కల్పించి జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నారు.

మరణించిన వారి ఓటును form 7 ద్వారా ఓటరు జాబితా నుండి తొలగించేలా చూడాలని,
ఓటరు జాబితా లో ఏవైనా తప్పులు ఉంటే Form 8 ద్వార సవరించుకోవాలని తెలియపర్చాలన్నారు.

ఓటు హక్కును ఓటర్ హెల్ప్ లైన్ యాప్, nvsp.in, ceo.telangana.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు

Share This Post