యువత మంచి ఆదర్శాలను అలవర్చుకోవాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

యువత  మంచి ఆదర్శాలను  అలవర్చుకోవాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

యువత మంచి ఆదర్శాలను అలవర్చుకోవాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, జనవరి 12:

యువత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మంచి ఆదర్శాలను, అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు.

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బుధవారం జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా జిల్లా యువజన, క్రీడా శాఖ అధ్వర్యంలో స్దానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన యువజన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

యువత స్వామి వివేకానంద ఆదర్శాలను స్వీకరించి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. స్వామి వివేకానంద భారతీయతకు చిహ్నం అని, పార్లమెంట్ ఆఫ్ రీలిజియస్ కాన్పరెన్స్ లో ఒక్క మాటతో దేశ ఔనత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటారని , అంతటి మహానుభావుడు స్వామి వివేకానంద అని, ఆ కారణంగా ఆయన జన్మదినం సందర్బంగా దేశ వ్యాప్తంగా యువజన దినోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. ఆయన జీవితంలో అనేక కష్టాలు అనుభవించి ఉన్నత స్థాయికి ఎదిగారని, ప్రస్తుతం విద్యార్థులు వివేకానందుడినీ ఆదర్శంగా తీసుకొని జివితంలో ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా యువజన క్రీడా శాఖాథికారి తిరుపతి రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ తూము రవీందర్, జాతీయ యువజన అవార్డ్ గ్రహీత ఈదునూరి శంకర్, కోండా రవి, యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీచేయనైనది.

Share This Post