యువత వ్యాపార వేత్తలుగా ఎదగాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
గురువారం జిల్లా కేంద్రం లోని నైపుణ్య శిక్షణ కేంద్రం లో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం ( పీఎంఈజీపీ ) పై అవగాహన సదస్సులో వ్యాపార వేత్తలుగా ఎదగాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష యువతకు పిలుపు నిచ్చారు. ప్రపంచం లోనే యువత ఎక్కువ గా ఉన్న దేశం భారత దేశం అన్నారు. PMEGP పథకం కి 18 నుండి 45 సంవత్సర ల వయస్సు గల వాళ్ళు అర్హులని, స్వయం ఉపాధి కోసం 59 కోర్సు లు ఉన్నాయని 30 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన వారికి వారి నైపుణ్యం మేరకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు. శిక్షణ పొందిన వారికి రుణాలు అందించడం జరుగుతుందని తద్వారా సొంతంగా చిన్నచిన్న యూనిట్లు పెట్టుకొని లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుటకు మరియు ఉపాధి అవకాశాలు కల్పించుటకు భారత ప్రభుత్వం వారిచే అమలు చేయబడుతున్న పీఎంఈజీపీ ఆగస్టు 2008లో ప్రారంభించబడిందన్నారు. 18 సంవత్సరాలు వయసు నిండిన వారు అర్హులని, ఆదయ పరిమితి లేదని, ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సాయం పొందుటకు అర్హులు అని తెలిపారు. సేవారంగంలో ఐదు లక్షలు పైబడిన ప్రాజెక్టుల స్థాపనకు అభ్యర్థులు కనీస చదువు ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని దరఖాస్తుదారులు ఆన్లైన్లో సంబంధించిన సమాచారాన్ని పీఎంఈజీపీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp లో మరియు అవసరమైన పత్రాలను ఆధార్ కార్డు, పాన్ కార్డు, అవసరమైన పాత్రలను అప్లోడ్ చేయాలన్నారు. . రెండు మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక టెంట్ హౌస్ పెట్టుకోవచ్చు పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకానికి స్కీమ్ వర్తిస్తుందన్నారు. ముఖ్యంగా మహిళలు మగ్గం వర్క్ బ్యూటీషియన్ పెట్టుకొని లాభాలు పొందవచ్చును. మహిళా సంఘాలకు మంజూరు అయిన రుణాలను చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద, ప్రాజెక్టు ఖర్చులో 25 శాతం నుంచి 35 శాతం వరకు లబ్దిదారులు ప్రభుత్వం నుంచి రాయితీగా పొందుతారన్నారు. ఎలాంటి సమాచారము అవసరమున్న స్వయంగా సంబందిత కార్యాలయానికి వెళ్లి సమాచారాన్ని తీసుకోవచ్చన్నారు అవగాహనా సదస్సు ప్రారంభం కంటే ముందు బాబా సాహెబ్ అంబేత్కర్, మహాత్మా గంధీ చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన తో సదస్సును ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో GM ఇంద్రాస్త్రియాల్ బాబు జిల్లా అధికారులు జ్యోతి, వెంకటేశ్వర్లు, గోపాల్, విజయ్ కుమార్ మరియు ఎంపిడిఓ లు యంపీ ఓ లు తదితరులు పాల్గొన్నారు.