దేవునిపల్లి లోని లక్ష్మీదేవి గార్డెన్లో ఆదివారం 283 వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు కామారెడ్డి నియోజకవర్గం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అటవీ సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. గిరిజనులు సంత్ సేవాలాల్ సందేశం గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఆధ్యాత్మికతను యువకులు అలవర్చుకోని మానసిక ప్రశాంతతను పొందాలని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. బాన్సువాడ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు. సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ వారు కలెక్టర్ కు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, ఉత్సవ కమిటీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. —————– జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.