యువత స్వామి వివేకానంద మార్గంలో నడవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం……1

తేదిః 12-01-2022

యువత స్వామి వివేకానంద మార్గంలో నడవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
యువత స్వామి వివేకానంద మార్గంలో నడవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, జనవరి 12: స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడిచి యువత ఉన్నత శిఖరాలను అదిగమిచాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. బుదవారం జిల్లా కేంద్రంలోని మిని స్టేడియంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకలలో పాల్గోన్న కలెక్టర్ మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, స్వామి వివేకానంద 39సంవత్సరాలు మాత్రమే జీవించనప్పటికి, వారి సందేశాలు అందరికి స్పూర్తిదాయకంగా నిలిచాయని తెలిపారు.

స్వామి వివేకానందుడు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ( ప్రతి సంవత్సరం జనవరి 12 న) జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటు యువతకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందని, యుతవ స్వామివివేకానందుని స్పూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలను అదిగమించాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

ఈ కార్యకమంలో జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, డిడబ్ల్యుఓ మరియు స్పోర్ట్స్ అధికారి నరేష్, డిపిఆర్ఓ వి. శ్రీధర్, మున్సిపల్ కమీషనర్ శ్రీమతి స్వరుపారాణి, జగిత్యాల తహసీల్దార్ దిలీప్ కుమార్, తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయనైనది.

Share This Post