ఆదివారం యు పి ఎస్ సి నిర్వహిస్తున్న ఇ పి ఎఫ్ ఓ లోని ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ మరియు అకౌంట్స్ ఆఫీసర్స్ భర్తీ కొరకు నిర్వహించిన పరీక్షా ఏర్పాట్ల పై మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ షర్మాన్ సికింద్రాబాద్ లోని పి జి కాలేజీ ని మరియు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసారు. అక్కడ ఏర్పాట్ల పై వెన్యూ సూపర్ వైసర్ మరియు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు లేవని పరీక్షా సాఫీగా జరుగుతున్నదని అధికారులు వివరించారు.
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ ,హైదరాబాద్