యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నవంబర్ 21 న నిర్వహించనున్న కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలనీ హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ లో 21 న కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (14 ) కేంద్రాలలో 6000  మంది అభ్యర్థులు మరియు ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ (1 ) కేంద్రాలలో 110  మంది అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నారని తెలిపారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 9.30  గంటల నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు మరియు ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్  ఉదయం 9.00  గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్న ఈ అడ్మిట్ కార్డు తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలని అన్నారు. ఈ పరీక్ష కు హాజరు అయ్యే అభ్యర్థులు కోవిద్ నిబంధనల ప్రకారం మాస్కులు, శానిటైజర్లు  సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు. మాస్కులు లేని అభ్యర్థులను పరీక్షకు అనుమతించరని స్పష్టం చేసారు. పరీక్ష నిర్వాహకులు మరియు  అభ్యర్థులు తప్పకుండ మాస్కులు ధరించాలని తెలిపారు.  గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వారు సూచించారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగదని స్పష్టం చేస్తూ, మొబైల్ ఫోన్లు టాబ్లెట్స్, పెన్డ్రైవ్స్, వాచీలు, క్యాలీసులటర్లు, వ్యాలెట్స్, ఇతర రికార్డినిగ్ పరికరాలు మొదలైనవి పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరగదన్నారు. హాల్ టిక్కెట్లలో సూచించిన పరీక్ష కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వెన్యూ సూపర్వైజర్లతో పాటు లోకల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్లు ఉంటారని తెలిపారు.

    

            ఈ కార్యక్రమంలో డీసీపీ బాబురావు  మరియు సంబంధిత అధికారులు  పాల్గొన్నారు. 

Share This Post