యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 28 వ తేదీన జరుగనున్న *సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ -2023.* పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యా రాణి సంభందిత అధికారులను ఆదేశించారు.

*ప్రచురణార్ధం*

25.05.2023.

*యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్- సివిల్ సర్వీసెస్ – ప్రిలిమ్స్ -2023.* *పరీక్ష*

UPSC – CIVIL SERVICES – (PRELIMS)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 28 వ తేదీన జరుగనున్న *సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ -2023.* పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యా రాణి సంభందిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ…ఈ నెల 28వ తేదీన జరగనున్న సివిల్ సర్వీసెస్ – ప్రిలిమ్స్ -2023. పరీక్ష ను రెండు సెషన్లలో నిర్వహించబడుతుందని అన్నారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు అలాగే రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుండి 4:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు మొత్తం 4 రూట్స్ లలో 11 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందుకు అవసరమైన లైసెన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైసన్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ , తదితర అధికారులను, సిబ్బందిని నియమించడం జరిగిందని అన్నారు.

ఈ పరీక్షకు 5035 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు E – అడ్మిట్ కార్డు మరియు ఐడి ప్రూఫ్ తీసుకురావాలని అన్నారు. పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందే గేటు మూసివేయబడుతుందని అన్నారు కావున అభ్యర్థులు ముందుగానే సెంటర్ కి వచ్చి ఉండాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. సురక్షిత మంచినీరు అందజేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు, అలాగే ఇన్విజిలేటర్ విధులు నిర్వహించు సిబ్బంది ఎవ్వరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ పోన్లు, క్యాలిక్యూలేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని చెప్పారు. నిశిత పరిశీలన తదుపరి మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. విద్యార్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలు తు.చ. తప్పక పాటించాలని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో UPSC ప్రతి నిధులు దిలీప్ కుమార్ సింగ్, DRO వాసుచంద్ర, DMWO శ్రీనివాస్, DCO నాగేశ్వర్ రావు, GM ఇండస్ట్రీస్ హరి ప్రసాద్, కలెక్టరేట్ AO కిరణ్ ప్రకాష్, రెవెన్యూ, పోలీస్,రవాణా,వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post