యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన రావుల జయసింహరెడ్డి(212), పత్తిపాక సాయికిరణ్(460), కొట్టే రుత్విక్ సాయి (558)లు లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను తన ఛాంబర్ లో గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
అనంతరం సివిల్స్ పరీక్షలకు వారు చదివిన తీరుతెన్నుల ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హనుమకొండ నుండి ఆరుగురు అభ్యర్థులు విజయం సాధించారు అని వారు వివరించారు.భవిష్యత్తులో నిరుపేదలకు పక్షాన నిలిచి వారి అభ్యున్నతి కోసం విధి నిర్వహణలో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.చిరుప్రాయంలోనే సివిల్స్ ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయం అని కలెక్టర్ అన్నారు. అలాగే నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ సివిల్స్ ర్యాంకులు సాధించిన జయసింహరెడ్డి, పత్తిపాక సాయికిరణ్, కొట్టే రుత్విక్ సాయి తెలిపడంతో పాటు, తమ పిల్లలను సివిల్స్ పరీక్షల్లో ర్యాంకు సాధించడంలో కృషి చేసిన తల్లిదండ్రులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు
ఈ కార్యక్రమములో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల,సామాజిక వేత్త EV శ్రీనివాస్ ,, పత్తిపాక సాయికిరణ్ తండ్రి కోమేరెల్లి,కొట్టే రుత్విక్ సాయి తండ్రి రాధా కృష్ణ రావు పాల్గోన్నారు.